- తాళం చెవి లేకపోవడంతో పగలకొట్టి లెక్కింపు l
- ఊహించినట్టు కానరాని ‘బ్లాక్ మనీ’ కట్టలు
సత్యదేవుని ప్రధాన హుండీ రాబడి రూ.11,40,633
Published Wed, Nov 16 2016 10:16 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
అన్నవరం :
సత్యదేవుని ప్రధానాలయ హుండీని బుధవారం లెక్కించగా రూ.11,40, 633 రాబడి లభించింది. దీంతో సత్యదేవుని గత 17 రోజులలో మొత్తం హుండీ ఆదాయం రూ.92,55,819కు చేరింది. స్వామివారి హుండీలను మంగళవారమే లెక్కించినా ప్రధానాలయంలోని హుండీ తాళం చెవి కనిపించకపోవడంతో ఆ హుండీని తెరవలేదు. అకౌంట్స్ విభాగంలో ఎంత వెదికినా బుధవారం కూడా తాళం చెవి కనిపించకపోవడంతో తాళం కప్పను పగులకొట్టి లెక్కించేందుకు దేవాదాయశాఖ ఏసీ రమేష్‌బాబు అనుమతించారు. బుధవారం ఉదయం పది గంటలకు దేవస్థానం చైర్మ¯ŒS రోహిత్, ఈఓ నాగేశ్వరరావు, ఏసీ రమేష్ బాబు, హుండీ తాళాన్ని పగులకొట్టించి, కానుకలను పది మూటలుగా కట్టి, నిత్యకల్యాణమండపానికి తీసుకువెళ్లి లెక్కించారు. రూ.10,82,500 నగదు, రూ.58,133 చిల్లర నాణాలు, అమెరికా డాలర్లు 26, సింగపూర్ డాలర్లు నాలుగు, ఆస్ట్రేలియా డాలర్లు 50 లభించాయి.
‘తాళం చెవి’ బాధ్యులకు చార్జి మెమో
పెద్ద నోట్ల రద్దు వలన బ్లాక్‌మనీ వదిలించుకునేందుకు బడాబాబులు ప్రధానాలయ హుండీలో పెద్ద ఎత్తున రూ.వేయి, రూ.500 నోట్ల కట్టలు వేస్తారన్న అధికారుల ఊహ నిజం కాలేదు. ఎవరైనా అలా ఆ నోట్లకట్టలు వేస్తే ఇతరులు చూడకుండా హుండీ చుట్టూ పోలింగ్ బూత్ మాదిరిగా వస్త్రం కూడా కట్టారు. ఈ నేపథ్యంలో ఈ హుండీ ఎప్పుడు తెరుస్తారా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే హుండీని తెరిచాక నోట్లకట్టలేమీ కనిపించలేదు. ఎవరో రూ.500 కట్ట ఒకటి, రూ.వంద కట్టలు ఒకకట్టగా కట్టి రూ.లక్ష హుండీలో వేశారు. కాగా హుండీ తాళం చెవి మాయం కావడానికి బాధ్యులైన వారికి చార్జి మెమో ఇచ్చినట్టు ఈఓ చెప్పారు.
Advertisement