satya deva
-
సత్యదేవుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
అన్నవరం : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి, సెలవు దినం కావడంతో రత్నగిరి సత్యదేవుని ఆలయానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తం 12 వేలమంది భక్తులు దర్శించుకోగా 1,233 వ్రతాలు జరిగాయి. సుమారు రూ.12 లక్షల ఆదాయం సమకూరింది. భక్తులతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ మెడికల్ ఆఫీసర్ కేహెచ్‌కే దొర, నేవీ డైరెక్టర్ థాకరేలు స్వామివారిని దర్శించినవారిలో ఉన్నారు. వారికి ఆలయం వద్ద ఏసీ జగన్నాథరావు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాలను బహూకరించారు. -
సత్యదేవుని ప్రధాన హుండీ రాబడి రూ.11,40,633
తాళం చెవి లేకపోవడంతో పగలకొట్టి లెక్కింపు l ఊహించినట్టు కానరాని ‘బ్లాక్ మనీ’ కట్టలు అన్నవరం : సత్యదేవుని ప్రధానాలయ హుండీని బుధవారం లెక్కించగా రూ.11,40, 633 రాబడి లభించింది. దీంతో సత్యదేవుని గత 17 రోజులలో మొత్తం హుండీ ఆదాయం రూ.92,55,819కు చేరింది. స్వామివారి హుండీలను మంగళవారమే లెక్కించినా ప్రధానాలయంలోని హుండీ తాళం చెవి కనిపించకపోవడంతో ఆ హుండీని తెరవలేదు. అకౌంట్స్ విభాగంలో ఎంత వెదికినా బుధవారం కూడా తాళం చెవి కనిపించకపోవడంతో తాళం కప్పను పగులకొట్టి లెక్కించేందుకు దేవాదాయశాఖ ఏసీ రమేష్‌బాబు అనుమతించారు. బుధవారం ఉదయం పది గంటలకు దేవస్థానం చైర్మ¯ŒS రోహిత్, ఈఓ నాగేశ్వరరావు, ఏసీ రమేష్ బాబు, హుండీ తాళాన్ని పగులకొట్టించి, కానుకలను పది మూటలుగా కట్టి, నిత్యకల్యాణమండపానికి తీసుకువెళ్లి లెక్కించారు. రూ.10,82,500 నగదు, రూ.58,133 చిల్లర నాణాలు, అమెరికా డాలర్లు 26, సింగపూర్ డాలర్లు నాలుగు, ఆస్ట్రేలియా డాలర్లు 50 లభించాయి. ‘తాళం చెవి’ బాధ్యులకు చార్జి మెమో పెద్ద నోట్ల రద్దు వలన బ్లాక్‌మనీ వదిలించుకునేందుకు బడాబాబులు ప్రధానాలయ హుండీలో పెద్ద ఎత్తున రూ.వేయి, రూ.500 నోట్ల కట్టలు వేస్తారన్న అధికారుల ఊహ నిజం కాలేదు. ఎవరైనా అలా ఆ నోట్లకట్టలు వేస్తే ఇతరులు చూడకుండా హుండీ చుట్టూ పోలింగ్ బూత్ మాదిరిగా వస్త్రం కూడా కట్టారు. ఈ నేపథ్యంలో ఈ హుండీ ఎప్పుడు తెరుస్తారా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే హుండీని తెరిచాక నోట్లకట్టలేమీ కనిపించలేదు. ఎవరో రూ.500 కట్ట ఒకటి, రూ.వంద కట్టలు ఒకకట్టగా కట్టి రూ.లక్ష హుండీలో వేశారు. కాగా హుండీ తాళం చెవి మాయం కావడానికి బాధ్యులైన వారికి చార్జి మెమో ఇచ్చినట్టు ఈఓ చెప్పారు. -
సత్యదేవుని హుండీలో పది నోట్లే ఎక్కువ
అన్నవరం : దేవస్థానంలో శుక్రవారం హుండీలు లెక్కించగా వచ్చిన ఆదాయంలో రూ.పది నోట్లు 1,62,827 ఉన్నాయి. హుండీల్లో వచ్చిన వివిధ డినామినేష¯ŒS గల కరెన్సీ నోట్ల వివరాలను దేవస్థానం అధికారులు శుక్రవారం సాయంత్రం తెలిపారు. వాటిలో రూ.వేయ్యి నోట్లు 1,189, రూ.500 నోట్లు 3,279, రూ.వంద నోట్లు 27,279, రూ.50 నోట్లు 11,765, రూ.ఐదు నోట్లు 2,364, రూ.రెండు నోట్లు ఏడు, 36 రూపాయి నోట్లు వచ్చాయి. వీటి విలువ రూ.80,65,930 కాగా, చిల్లర నాణెల విలువ 4,15,771. మొత్తం హుండీ ఆదాయం రూ.84,81,701. దేవస్థానంలో మొత్తం 54 హుండీలు ఉన్నాయి. ఈ హుండీల వారీగా కూడా ఎంత ఆదాయం వచ్చిందో అధికారులు విశ్లేషించారు. గత నెలకు ఈ నెలకు ఏ హుండీ ద్వారా ఆదాయం పెరిగిందో, అదే విధంగా ఆదాయం తగ్గిన హుండీలు అందుకు తగిన కారణాలపై కూడా విశ్లేషణ ప్రారంభించారు. అయితే ఆ వివరాలు గోప్యంగా ఉంచారు. సత్యదేవుని హుండీలో వెండి డాలర్లు అన్నవరం : భక్తులు సమర్పించిన పలు కార్పొరేట్ సంస్థలు ముద్రించిన వెండి డాలర్లు సత్యదేవుని హుండీలో లభించాయి. అక్టోబర్ నెలకు సంబంధించి సత్యదేవుని హుండీలను శుక్రవారం తెరిచి లెక్కించగా రూ.84,81,701 ఆదాయం లభించింది. దీంతోపాటు సాగర్ లూబ్రికంట్స్ సంస్థ ముద్రించిన పది గ్రాముల వెండి డాలర్లు నాలుగు, ఏజీఐపీ సంస్థ ముద్రించిన 15 గ్రాముల బరువు కలిగిన వెండి డాలర్లు మూడు, హోండా సంస్థ ముద్రించిన పది గ్రాముల వెండి డాలర్ హుండీల్లో లభించాయి. వీటితోపాటు సుమారు వంద గ్రాముల బరువు కలిగిన వెండి కిరీటం కూడా ఉంది. తిరుమల హుండీలాగే.. తిరుమలలో వేంకటేశ్వరస్వామి ఆలయంలోని ప్రధానాలయం హుండీ మాదిరి గానే సత్యదేవుని ఆలయంలో కూడా హుండీకి గుడ్డ కట్టి ఆకర్షణీయంగా రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆ హుండీకి రంగువస్రా్తలతో తయారు చేసిన కవర్‌ను తొడిగారు. హుండీ పైభాగంలో కూడా వస్రా్తన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
సత్తెన్నా.. సత్రానికి చేరేదెలా?
హరిహర సదన్ సత్రం సత్యగిరిపైన... గదులిచ్చే కార్యాలయం రత్నగిరిపైన.. రెండు గిరుల మధ్య దూరం 1.5 కిలోమీటర్లు దేవస్థాన వాహనం లేక ఇబ్బందులు బస చేసే భక్తులకు తప్పని ఇబ్బందులు అన్నవరం దేవస్థానం సత్రాల్లో ఉండాలనుకునే భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రత్నగిరిపై ఉండేవారు సరే ... సత్యగిరిపై ఉండేవారు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారు. సంబంధిత అధికారులకు ఈ ఇబ్బందులు తెలిసినా పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నవరం : సత్రాలు ఓ వైపు ... ఈ సత్రాలకు రశీదులు ఇచ్చే కార్యాలయం మరో వైపు ... ఈ రెండింటికీ దూరం ఒకటిన్నర కిలోమీటరు. దీంతో భక్తులు ఇబ్బందులు తారాస్థాయికి చేరుకుం టున్నాయి. అన్నవరం దేవస్థానంలో సత్యగిరిపై నిర్మిం చిన హరిహర సత్రం ఉంది. ఈ సత్రంలో బస చేయాలంటే రత్నగిరిపైనున్న గదుల రిజర్వేషన్ కార్యాలయంS(సీఆర్ఓ ఆఫీసు)కు వెళ్లి రుసుం చెల్లించి రశీదు పొందాలి. ఆ రశీదు కోసం 1.5 కిలోమీటరు దూరం వెళ్లాల్సిందే. ఆటోల్లో వెళ్దామన్నా అందుబాటులో లేని పరిస్థితి. రూ.20 కోట్లతో నిర్మించిన సత్రం... అన్నవరం దేవస్థానంలోని రత్నగిరిపై గల ఆరు సత్రాల్లో దాదాపు 350 గదులున్నాయి. సత్యగిరిపై ఉన్న హరిహర సదన్‌ను రూ.20 కోట్ల వ్యయంతో 135 గదులతో (వీటిలో 84 గదులు ఏసీ)... అధునాతన హంగులతో ... ఐదు అంతస్తుల్లో , రెండు లిఫ్ట్‌లతో నిర్మించారు. ఈ సత్రంలో నాన్ ఏసీ గది అద్దె రూ.600 కాగా, ఏసీ గది రూ.950. సత్రంలో గదులన్నీ నిండితే రోజుకి రూ.1.10 లక్షలు ఆదాయం వస్తుంది. ఈ సత్రానికి చేరుకోవడానికి దేవస్థానం బస్సులు కానీ, మరే ఇతర వాహనాల సదుపాయం లేదు. దీంతో సొంత వాహనాలు లేని భక్తులు ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా ఆటో డ్రైవర్లు భక్తుల్ని ఆ సత్రానికి తీసుకువెళ్లడానికి రూ.50 నుంచి రూ.100 వరకూ వసూలు చేస్తున్నారు. టీ, టిఫిన్ కావల్సినా రత్నగిరికి రావల్సిందే.. హరిహరసదన్ సత్రంలో బస చేసే భక్తులు టీ, టిఫిన్ కోసం 1.5 కిలోమీటర్ దూరంలోని రత్నగిరి కొండమీదకు రావల్సిందే. లేదంటే రత్నగిరి నుంచి ఆటోను రప్పించుకోవల్సిందే. వచ్చి ... రత్నగిరికి వెళ్లి మళ్లీ సత్రానికి వెళ్లాలంటే మూడు ట్రిప్పులవుతుంది. దీంతో రూ.వంద నుంచి రూ.150 వరకూ వసూలు చేస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటలు నుంచి ఉదయం ఆరు గంటల వరకూ కొండదిగువ నుంచి మీదకు ఆటోలు అనుమతించకపోవడంతో మరిన్ని ఇక్కట్లు తప్పడం లేదు. రెండు వాహనాలు సత్యగిరికి నడపాల్సిందే... రత్నగిరి సీఆర్ఓ కార్యాలయం నుంచి సత్యగిరిపై గల హరిహర సదన్ సత్రానికి టాటా మేజిక్లాంటి వాహనాలను రెండింటిని ప్రతిరోజూ నడిపేలా దేవస్థానం చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఒక వాహనం సీఆర్ఓ కార్యాలయం వద్ద, మరో వాహనం హరిహర సదన్ సత్రం వద్ద ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ఇందుకుగాను ఒక భక్తుని వద్ద నుంచి ఎంత వసూలు చేయాలో దేవస్థాన మే నిర్ణయించాలని, లేదా సీజన్, అన్‌సీజన్ అనే బేధం లేకుండా దేవస్థానమే రత్నగిరి నుంచి సత్యగిరికి ఉచిత బస్సు నడపాలని భక్తులు కోరుతున్నారు. రాత్రి వేళల్లో రత్నగిరి సత్రాల్లో గదులు కేటాయించాలని ఆదేశించాం హరిహరసదన్ సత్రానికి వెళ్లేందుకు ఉన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని సొంత వాహనాలు ఉన్న భక్తులకే ఆ సత్రంలో గదులు కేటాయించాలని సిబ్బందిని ఆదేశించామని ఈఓ కె.నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. రాత్రి వేళల్లో అయితే రత్నగిరి సత్రాల్లోనే గదులు ఇవ్వాలని చెప్పామన్నారు. భక్తులు రద్దీ అధికంగా ఉన్నప్పుడు దేవస్థానం బస్సును ఉచితంగా సత్యగిరికి నడుపుతున్నాం. రెగ్యులర్‌గా నడిపే విషయం కూడా పరిశీలిస్తామన్నారు. – కె. నాగేశ్వరరావు, ఆలయ ఈఓ