సత్యదేవుని హుండీలో పది నోట్లే ఎక్కువ | satya deva hundi profit | Sakshi
Sakshi News home page

సత్యదేవుని హుండీలో పది నోట్లే ఎక్కువ

Published Fri, Oct 28 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

సత్యదేవుని హుండీలో పది నోట్లే ఎక్కువ

సత్యదేవుని హుండీలో పది నోట్లే ఎక్కువ

అన్నవరం :
దేవస్థానంలో శుక్రవారం హుండీలు లెక్కించగా వచ్చిన ఆదాయంలో రూ.పది నోట్లు 1,62,827 ఉన్నాయి. హుండీల్లో వచ్చిన వివిధ డినామినేష¯ŒS గల కరెన్సీ నోట్ల వివరాలను దేవస్థానం అధికారులు శుక్రవారం సాయంత్రం తెలిపారు. వాటిలో రూ.వేయ్యి నోట్లు 1,189, రూ.500 నోట్లు 3,279, రూ.వంద నోట్లు 27,279, రూ.50 నోట్లు 11,765, రూ.ఐదు నోట్లు 2,364, రూ.రెండు నోట్లు ఏడు, 36 రూపాయి నోట్లు వచ్చాయి. వీటి విలువ రూ.80,65,930 కాగా, చిల్లర నాణెల విలువ 4,15,771. మొత్తం హుండీ ఆదాయం రూ.84,81,701. దేవస్థానంలో మొత్తం 54 హుండీలు ఉన్నాయి. ఈ హుండీల వారీగా కూడా ఎంత ఆదాయం వచ్చిందో అధికారులు విశ్లేషించారు. గత నెలకు ఈ నెలకు ఏ హుండీ ద్వారా ఆదాయం పెరిగిందో, అదే విధంగా ఆదాయం తగ్గిన హుండీలు అందుకు తగిన కారణాలపై కూడా విశ్లేషణ ప్రారంభించారు. అయితే ఆ వివరాలు గోప్యంగా ఉంచారు.
సత్యదేవుని హుండీలో వెండి డాలర్లు  
అన్నవరం : భక్తులు సమర్పించిన పలు కార్పొరేట్‌ సంస్థలు ముద్రించిన వెండి డాలర్లు సత్యదేవుని హుండీలో లభించాయి. అక్టోబర్‌ నెలకు సంబంధించి సత్యదేవుని హుండీలను శుక్రవారం తెరిచి లెక్కించగా రూ.84,81,701 ఆదాయం లభించింది. దీంతోపాటు సాగర్‌ లూబ్రికంట్స్‌ సంస్థ ముద్రించిన పది గ్రాముల వెండి డాలర్లు నాలుగు, ఏజీఐపీ సంస్థ ముద్రించిన 15 గ్రాముల బరువు కలిగిన వెండి డాలర్లు మూడు, హోండా సంస్థ ముద్రించిన పది గ్రాముల వెండి డాలర్‌ హుండీల్లో లభించాయి. వీటితోపాటు సుమారు వంద గ్రాముల బరువు కలిగిన వెండి కిరీటం కూడా ఉంది.
తిరుమల హుండీలాగే..
తిరుమలలో వేంకటేశ్వరస్వామి ఆలయంలోని ప్రధానాలయం హుండీ మాదిరి గానే సత్యదేవుని ఆలయంలో కూడా హుండీకి గుడ్డ కట్టి ఆకర్షణీయంగా రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆ హుండీకి రంగువస్రా్తలతో తయారు చేసిన కవర్‌ను తొడిగారు. హుండీ పైభాగంలో కూడా వస్రా్తన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement