hundi profit
-
పెరిగిన శ్రీకాళహస్తీశ్వరుడి ఆదాయం
శ్రీ కాళహస్తి: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుని ఆదాయం పెరిగింది. అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో హుండీల ద్వారా రూ.36,06,916 మేర ఆదాయం అధికంగా వచ్చింది. నవంబర్‌లో రెండుసార్లుగా హుండీలను లెక్కించారు. 16 వ తేదీన లెక్కింపు ద్వారా రూ. 87,02,048 రాగా అదే నెలలో తిరిగి 25 వ తేదీన లెక్కించగా రూ. 32,11,205 లు మొత్తం రూ.1,19,13,253 లు వచ్చింది. అక్టోబర్‌లో 9 నుంచి 29వ తేదీ వరకు 5,79,418 మంది భక్తులు దర్శించుకోగా ఆర్జిత, ప్రసాద విక్రయాల ద్వారా రూ.3,37,45,345 ఆదాయం వచ్చింది. ప్రధానంగా కార్తీక మాసం కావడం కూడా కొంతమేరకు కలిసొచ్చిందని భావిస్తున్నారు. ఓ అజ్ఞాత భక్తుడు రూ. వెయ్యి కట్టలు రెండింటిని హుండీలో వేసినట్లు గుర్తించారు. ప్రధానంగా రద్దు చేసిన రూ.1000, రూ.500 నోట్లు ఎక్కువ వచ్చాయని, ఈ నెలాఖరు వరకు పెద్ద నోట్లు హుండీల ద్వారా వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. -
రికార్డు స్థాయిలో సత్యదేవుడి ఆదాయం
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో కొలువై ఉన్న సత్యనారాయణ స్వామికి కార్తీకమాసంలో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వచ్చింది. వివిధ విభాగాల ద్వారా రికార్డు స్థాయిలో రూ.14.01 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే రూ.2.67 కోట్లు అదనం. అధిక శాతం వ్రతాలు, దర్శనాలు, హుండీల ద్వారా వచ్చింది. భక్తుల తాకిడి, ఆదాయంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడలేదు. చిల్లర ఇబ్బందులతో అధికారులు తీసుకున్న పలు నిర్ణయాలతో ఆదాయం పెరిగింది. రద్దయిన నోట్లు హుండీల ద్వారా ఎక్కువగా వస్తాయని అంచనా వేసినా సాధారణస్థాయిలోనే వచ్చాయి. వ్రతాల ద్వారా రికార్డుస్థాయిలో అంటే రూ.5,35,23,937 సమకూరింది. పెద్ద నోట్ల రద్దుతో చిల్లర సమస్య కారణంగా ఈ నెల 8 నుంచి రూ.150 ల టికెట్లను రద్దు చేశారు. ఇక హుండీ ఆదాయం చూస్తే రికార్డు స్థాయిలో రూ.1.95 కోట్లు వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే రూ. 78 లక్షలు అదనం. అతి తక్కువ విలువైన నోట్లు అధికంగా వచ్చాయి. -
సత్యదేవుని హుండీలో పది నోట్లే ఎక్కువ
అన్నవరం : దేవస్థానంలో శుక్రవారం హుండీలు లెక్కించగా వచ్చిన ఆదాయంలో రూ.పది నోట్లు 1,62,827 ఉన్నాయి. హుండీల్లో వచ్చిన వివిధ డినామినేష¯ŒS గల కరెన్సీ నోట్ల వివరాలను దేవస్థానం అధికారులు శుక్రవారం సాయంత్రం తెలిపారు. వాటిలో రూ.వేయ్యి నోట్లు 1,189, రూ.500 నోట్లు 3,279, రూ.వంద నోట్లు 27,279, రూ.50 నోట్లు 11,765, రూ.ఐదు నోట్లు 2,364, రూ.రెండు నోట్లు ఏడు, 36 రూపాయి నోట్లు వచ్చాయి. వీటి విలువ రూ.80,65,930 కాగా, చిల్లర నాణెల విలువ 4,15,771. మొత్తం హుండీ ఆదాయం రూ.84,81,701. దేవస్థానంలో మొత్తం 54 హుండీలు ఉన్నాయి. ఈ హుండీల వారీగా కూడా ఎంత ఆదాయం వచ్చిందో అధికారులు విశ్లేషించారు. గత నెలకు ఈ నెలకు ఏ హుండీ ద్వారా ఆదాయం పెరిగిందో, అదే విధంగా ఆదాయం తగ్గిన హుండీలు అందుకు తగిన కారణాలపై కూడా విశ్లేషణ ప్రారంభించారు. అయితే ఆ వివరాలు గోప్యంగా ఉంచారు. సత్యదేవుని హుండీలో వెండి డాలర్లు అన్నవరం : భక్తులు సమర్పించిన పలు కార్పొరేట్ సంస్థలు ముద్రించిన వెండి డాలర్లు సత్యదేవుని హుండీలో లభించాయి. అక్టోబర్ నెలకు సంబంధించి సత్యదేవుని హుండీలను శుక్రవారం తెరిచి లెక్కించగా రూ.84,81,701 ఆదాయం లభించింది. దీంతోపాటు సాగర్ లూబ్రికంట్స్ సంస్థ ముద్రించిన పది గ్రాముల వెండి డాలర్లు నాలుగు, ఏజీఐపీ సంస్థ ముద్రించిన 15 గ్రాముల బరువు కలిగిన వెండి డాలర్లు మూడు, హోండా సంస్థ ముద్రించిన పది గ్రాముల వెండి డాలర్ హుండీల్లో లభించాయి. వీటితోపాటు సుమారు వంద గ్రాముల బరువు కలిగిన వెండి కిరీటం కూడా ఉంది. తిరుమల హుండీలాగే.. తిరుమలలో వేంకటేశ్వరస్వామి ఆలయంలోని ప్రధానాలయం హుండీ మాదిరి గానే సత్యదేవుని ఆలయంలో కూడా హుండీకి గుడ్డ కట్టి ఆకర్షణీయంగా రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆ హుండీకి రంగువస్రా్తలతో తయారు చేసిన కవర్‌ను తొడిగారు. హుండీ పైభాగంలో కూడా వస్రా్తన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
రికార్డు స్థాయిలో వరసిద్ధుని ఆదాయం
కాణిపాకం(ఐరాల) : కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. గత ఏడాది బ్రహ్మోత్సవాల్లో రూ.89 లక్షల ఆదాయం రాగా ఈ ఏడాది రూ.కోటి 7 లక్షలకు చేరింది. శుక్రవారం ఆలయ ఆన్వేటి మండపంలో ఈవో పి.పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 31 రోజులకు గాను నగదు రూపంలో రూ.1,07,86,619 వచ్చింది. బంగారం 50 గ్రాములు, కేజీ వెండి కానుకగా అందింది. నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.9,297, ప్రచార రథం హుండీ ద్వారా రూ.14,505, భిక్షాండి హుండీలో రూ.8,311 వచ్చింది. విదేశీ కరెన్సీ సైతం వచ్చినట్లు ఈవో పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన ఏపీ వెంకటేషు, ఏఈవో కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర, స్వాములు వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు మల్లికార్జున, చిట్టిబాబు పాల్గొన్నారు.