పెరిగిన శ్రీకాళహస్తీశ్వరుడి ఆదాయం | Srikalahasteeswara Temple hundi profit | Sakshi
Sakshi News home page

పెరిగిన శ్రీకాళహస్తీశ్వరుడి ఆదాయం

Published Sat, Dec 3 2016 11:02 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

Srikalahasteeswara Temple hundi profit

శ్రీ కాళహస్తి: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుని ఆదాయం పెరిగింది. అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో హుండీల ద్వారా రూ.36,06,916 మేర ఆదాయం అధికంగా వచ్చింది. నవంబర్‌లో రెండుసార్లుగా హుండీలను లెక్కించారు. 16 వ తేదీన లెక్కింపు ద్వారా రూ. 87,02,048 రాగా అదే నెలలో తిరిగి 25 వ తేదీన లెక్కించగా రూ. 32,11,205 లు మొత్తం రూ.1,19,13,253 లు వచ్చింది.
 
అక్టోబర్‌లో 9 నుంచి 29వ తేదీ వరకు 5,79,418 మంది భక్తులు దర్శించుకోగా ఆర్జిత, ప్రసాద విక్రయాల ద్వారా రూ.3,37,45,345 ఆదాయం వచ్చింది.  ప్రధానంగా కార్తీక మాసం కావడం కూడా కొంతమేరకు కలిసొచ్చిందని భావిస్తున్నారు. ఓ అజ్ఞాత భక్తుడు రూ. వెయ్యి కట్టలు రెండింటిని హుండీలో వేసినట్లు గుర్తించారు. ప్రధానంగా రద్దు చేసిన రూ.1000, రూ.500 నోట్లు ఎక్కువ వచ్చాయని, ఈ నెలాఖరు వరకు పెద్ద నోట్లు హుండీల ద్వారా వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement