రికార్డు స్థాయిలో సత్యదేవుడి ఆదాయం
రికార్డు స్థాయిలో సత్యదేవుడి ఆదాయం
Published Wed, Nov 30 2016 11:12 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో కొలువై ఉన్న సత్యనారాయణ స్వామికి కార్తీకమాసంలో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వచ్చింది. వివిధ విభాగాల ద్వారా రికార్డు స్థాయిలో రూ.14.01 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే రూ.2.67 కోట్లు అదనం. అధిక శాతం వ్రతాలు, దర్శనాలు, హుండీల ద్వారా వచ్చింది. భక్తుల తాకిడి, ఆదాయంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడలేదు. చిల్లర ఇబ్బందులతో అధికారులు తీసుకున్న పలు నిర్ణయాలతో ఆదాయం పెరిగింది.
రద్దయిన నోట్లు హుండీల ద్వారా ఎక్కువగా వస్తాయని అంచనా వేసినా సాధారణస్థాయిలోనే వచ్చాయి. వ్రతాల ద్వారా రికార్డుస్థాయిలో అంటే రూ.5,35,23,937 సమకూరింది. పెద్ద నోట్ల రద్దుతో చిల్లర సమస్య కారణంగా ఈ నెల 8 నుంచి రూ.150 ల టికెట్లను రద్దు చేశారు. ఇక హుండీ ఆదాయం చూస్తే రికార్డు స్థాయిలో రూ.1.95 కోట్లు వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే రూ. 78 లక్షలు అదనం. అతి తక్కువ విలువైన నోట్లు అధికంగా వచ్చాయి.
Advertisement