Kartika masam
-
రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్ దంపతుల పూజ
బెంగళూరు: బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తితో కలిసి బెంగళూరులో పర్యటించారు. కార్తీక మాసం పవిత్రమైన మాసం కావడంతో గురురాఘవేంద్ర స్వామి ఆశీస్సులు పొందేందుకు ఈ దంపతులు మఠాన్ని సందర్శించారు. జయనగర్‌లో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు సునక్ అత్తమామలు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఉన్నారు. గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా దర్శనమిచ్చాయి. స్వామివారి దర్శనం సందర్భంగా ఆలయ సంప్రదాయ పూజల్లో వారు పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయాలపై తన విశ్వాసం గురించి బహిరంగంగానే ప్రకటించే రిషి సునాక్.. గతంలో దేశంలో పర్యటించినప్పుడు అనేక దేవాలయాలను సందర్శించారు. ఈ ఏడాది జనవరిలో సునాక్ లండన్‌లోని ప్రఖ్యాత బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్‌ను సందర్శించారు. ‘‘నేను హిందువును. అందరిలాగే, నేనూ నా విశ్వాసం నుంచి ప్రేరణను, ఓదార్పును పొందుతాను. పార్లమెంటు సభ్యుడిగా ‘భగవద్గీత’పై ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. -
గఢ్‌ముక్తేశ్వర్‌లో కార్తీక పూర్ణిమ సందడి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గఢ్‌ముక్తేశ్వర్ భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడ నిర్వహిస్తున్న కార్తీక పూర్ణిమ మేళాకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఓ వైపు ఘంటానినాదాలు, మరోవైపు మేళతాళాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. గంగానది ఒడ్డున అలంకరించిన దీపాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. గఢ్‌ముక్తేశ్వర్‌లోని గంగా ఘాట్లు భక్తుల కీర్తనలతో మారుమోగుతున్నాయి. మహాభారత కాలం నుంచి కార్తీక మాసంలో ఇక్కడి గంగానది ఒడ్డున జాతర జరుగుతూ వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ప్రధాన స్నానం నవంబర్ 26,27 తేదీలలో జరగనుంది. దీంతో భక్తుల రద్దీ మొదలైంది. భక్తుల రాకతో పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది. ఇక్కడికి వచ్చే భక్తులంతా గంగామాతకు హారతులు ఇస్తున్నారు. గంగా ఘాట్లపై యువతులు అందమైన ముగ్గులు వేస్తున్నారు. హాపూర్ ఎస్పీ అభిషేక్ వర్మ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ మేళా నవంబర్ 29 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇక్కడ ప్రధాన స్నానం నవంబర్ 26, 27 తేదీలలో జరుగుతుందని, దాదాపు 35 నుంచి 40 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా వేస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన 2200 మంది పోలీసులు గంగామేళాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: సొరంగం పైనుంచి రెస్క్యూ ఆపరేషన్? -
భక్తులతో కిటకిటలాడుతున్న అమరావతి అమరేశ్వరస్వామి దేవస్థానం
-
కార్తీక మాసం ముగింపు సంధర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు
-
ఆమలకం అత్యుత్తమం
ప్రాణికోటి సమస్తం ఆరు ఋతువుల ధర్మాలకు అనుగుణంగా నడచుకోవటం ఆరోగ్యానికి అవసరం. శరదృతువులో వచ్చే కార్తిక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేసే ఉత్సవం వన భోజనం. ఈ కాలంలో లభించే ఉసిరికాయ క్రమంగా ఫలంగా మారి బలీయమైన గుణధర్మాలు కలిగి ఉంటుంది. సంస్కృతంలో ఆమలకీ, అమృతఫల, శ్రీఫల, శివ మొదలైన పేర్లతో పిలుస్తారు. గుణధర్మాలు: దీని రుచి షడ్రసాలలో ఉప్పు మినహా తక్కిన ఐదు (తీపి, పులుపు, కటు, తిక్త, కషాయ రసాలు) కలిగి ఉంటుంది. ప్రధానంగా నోటికి తగిలేది పులుపు, తీపి, వగరు, త్రిదోష (వాత, పిత్త, కఫ) శ్యామకం. వివిధ ఔషధ రూపాలు: పచ్చిగా రసం తీసినా, ఎండబెట్టి వరుగులు చేసినా, గింజలు తీసేసి, ఎండిన వరుగులను చూర్ణం చేసినా, మురబ్బా చేసినా, రోటి పచ్చడి చేసినా నిల్వ ఉండే ఊరగాయగా మలచినా, కొంచెం వేడి చేసినా, దీనిలోని పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. విశిష్ట ఔషధ ప్రయోగాలు: వయస్థాపకం (ముసలితనాన్ని రానీయదు), వృష్యం (శుక్ర కరం), రసాయనం. (సప్త ధాతు పుష్టికరం): ప్రతిదినం రెండు చెంచాల ఉసిరిక రసం ఒక చెంచా తేనెతో సేవించాలి. ఇది మెదడుకి పదును పెట్టి తెలివితేటలు పెంచుతుంది. జ్వరాలు: ఉసిరికాయల రసాన్ని నేతితో వేడి చేసి సేవించాలి. ఆకలి కలగడానికి: ఉసిరికాయలకు నెయ్యి, జీలకర్ర, ఇంగువ చేర్చి, నేతితో ఉడికించి తినాలి. అర్శస్ (పైల్స్/మూల శంక): మజ్జిగలో తిప్ప తీగ, ఉసిరిక రసాలను కలిపి తాగాలి. ఉసిరిక చూర్ణానికి కరక్కాయ, తానికాయ చూర్ణాలను కూడా కలిపి సేవించాలి (త్రిఫల చూర్ణం) కామెర్లు (జాండిస్): ఉసిరిక రసం + ద్రాక్ష రసం ముక్కులోంచి రక్తస్రావం (ఎపిన్టాక్సిన్): ఉసిరి కాయల ముద్దను నేతితో కలిపి వేడి చేసి తలపై పట్టించాలి. బొంగురు గొంతు: ఉసిరిక రసం + పాలు ఎక్కిళ్లు (హిక్క): ఉసిరిక రసం + వెలగ కాయ, పిప్పళ్ల చూర్ణం + తేనె దగ్గు: ఆమలకీ చూర్ణం + పాలు, నెయ్యి మూర్ఛ: ఉసిరిక చూర్ణ కషాయం + తేనె హృదయ రోగాలు: చ్యవనప్రాశ, అగస్త్య లేహ్యాలు (వీటిలో – ఆమలకీ ప్రధాన ద్రవ్యం) వాంతులు: పెసరపప్పుతో జావ కాచి, చల్లార్చి, ఉసిరిక రసం కలిపి సేవించాలి. ఉసిరి వలన తగ్గే ఇతర రోగాలు: దద్దుర్లు, దురదలు, మచ్చల వంటి అనేక చర్మరోగాలు; తెల్లబట్ట వంటి స్త్రీ రోగాలు, మూత్ర రోగాలు (ప్రమేహ): శృంగార సమస్యలను తొలగించే వాజీకరణం కూడా. శిరోజాలకు మంచిది. కంటి చూపునకు చాలా మంచిది. ఆధునిక శాస్త్రం రీత్యా పోషక విలువలు: పీచు అధికంగా ఉండి శక్తి వర్ధక పోషకాలు కలిగి ఉంటుంది. విటమిన్ సి ప్రధానంగా అన్ని విటమినులూ ఉంటాయి. క్యాల్షియం, జింక్, కాపర్, ఫాస్ఫరస్, మాంగనీసు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్ వంటి లవణాలన్నీ పుష్కలంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు అతి తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంటుగా పనిచేసి క్యాన్సరును దూరం చేస్తుంది. అతి ముఖ్య సారాంశం... అధిక పుష్టినొసగు అన్ని యంగములకు సర్వరోగ హరము వయస్థాపకంబు అన్ని వయసుల వారికిన్ అమృత సమము ఉత్తమోత్తమ ద్రవ్యంబు ఉసిరి ఫలము. డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
సీఎం కేసీఆర్ నూతన ఇంటి గడప ప్రతిష్ట
జగదేవ్‌పూర్ (గజ్వేల్): సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో నిర్మిస్తున్న కొత్త ఇంటికి కేసీఆర్ దంపతులు గడప ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామన 5.10 గంటలకు గడపను ప్రతిష్టించారు. కార్తీక మాసం సప్తమి సందర్భంగా మంచిరోజు ఉందని శృంగేరి పండితులు చేసిన సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. శృంగేరీ పీఠం మండితులు ఫణి శశాంకశర్మ, గోపికృష్ణశర్మ పర్యవేక్షణలో మరికొంతమంది పండితుల సమక్షంలో గడప ప్రతిష్టతో పాటు గోమాత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వ్యవసాయ క్షేత్రంలో గతంలో నిర్మించిన ఇంటిని కూల్చివేసి నైరుతి ప్రాంతంలో కొన్ని నెలల క్రితం నూతన ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులతో పాటు కుటుంబసభ్యులు, బంధువులు పాల్గొన్నట్లు తెలిసింది. -
ఆధ్యాత్మికం ఆరోగ్యం సామాజికం
శివకేశవులకి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో భక్తులంతా భగవన్నామ స్మరణలో మునిగి తేలుతూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఉపవాసం, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే కార్తీకమాసంలో ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ‘ఆశుతోషుడు’ అని పేరు. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి. శక్తిలేని వారు ఉదయం స్నానం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పళ్ళు తీసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీ మాసంలో చేసుకునే వ్రతాలు. ఈ మాసంలో ఇవి చేయడం మంచిది: ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం నియమనిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలం చెప్పనలవి కానిది. కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహరణలను బట్టి తెలుసుకోవచ్చు. కార్తీకమాసంలో ప్రతిరోజూ విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. ఇంట్లో కూడా ప్రతిరోజూ సంధ్యాదీపాన్ని వెలిగించాలి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం. ఈ మాసమంతా కార్తీకపురాణాన్ని రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం. ఈ మాసంలో ఇవి చేయరాదు తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోవడం, ద్రోహ బుద్ధి, పాపపు ఆలోచనలు, దైవదూషణ, దీపారాధనలకు తప్ప నువ్వుల నూనెను ఇతరత్రా అవసరాలకు ఉపయోగించడం, మినుములు తినడం, నలుగుపెట్టుకుని స్నానం చేయడం. వృక్షారాధన విగ్రహారాధన ఏర్పడక ముందు, మన పూర్వీకులు ప్రకృతినే పూజించేవారు. వారి దృష్టిలో తమకు ఆహారాన్నీ, నీడనూ, నారబట్టలనూ అందించే వృక్షాలు గొప్ప దేవతలు. మనిషి ఎంతగా ఎదిగినా ప్రకృతికి లోబడక తప్పదని పెద్దలకు తెలుసు. అందుకే వృక్షాలను కూడా దేవతార్చనలో భాగం చేశారు. వినాయక చవితి, క్షీరాబ్ది ద్వాదశి వంటి సందర్భాలలో అయితే వృక్షాలదే ప్రధాన పాత్ర. అలాంటి వృక్షాలలో ప్రధానమైన ఉసిరికి కార్తీక మాసంలో వీలైనంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తూ విష్ణుమూర్తిగా భావించి పూజించాలన్నది పెద్దల మాట. కార్తీక సోమవారం లేదా మాసంలోని ఏదో ఒకరోజు ఉసిరిచెట్టు కింద భోజనం చేయడం మంచిది. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షింతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండిత సత్కారం చేసి భగవన్నామ స్మరణతో భోజనం చేయడం వల్ల సర్వపాపాలు నశిస్తాయని నమ్మకం. బిల్వపత్రాలతో... తులసి దళాలతో... మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును ‘శివేష్ట’ అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలం. అంటే సిరిని తెచ్చే ఫలమని అర్థం. మారేడు పత్రాలు త్రిశిఖలా మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, మోక్షం ప్రాప్తిస్తుందనీ శాస్త్రోక్తి. కనుకనే శివపూజలో బిల్వ పత్రాలు తప్పనిసరిగా ఉంటాయి. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వవృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు. బిల్వ పత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత కూడా దాగి ఉంది. ఈ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చడం వంటికి మేలు. జబ్బులు రావు. బాహ్య, అంతః కరణాలు శుద్ధిగా వుండేట్లు చేసి, దేహాన్ని శ్రేష్ఠంగా ఉంచుతుంది. గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్ఛత కోల్పోయే అవకాశం వుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్ఛతను కలుగచేస్తాయి. అది మారేడు విశిష్టత. వాతావరణంలో ఎక్కడ చెడు ఉన్నా, దాన్ని హరించి మెరుగుపరచడమే మారేడు లక్షణం.ఇన్ని విశిష్టతలున్నాయి కనుకనే శివుడికి మారేడు అంటే ప్రీతి. ఇక విష్ణుపూజలో తులసిని విరివిగా వాడుతారు. తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుందని, తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవని, ఉదయాన్నే తులసిని దర్శించుకోవడం సకల పాపహరమనీ ప్రతీతి. Mఅయ్యప్ప దీక్ష, సాయి దీక్ష, భవానీ దీక్ష, హనుమద్దీక్ష... ఇలా వివిధ దీక్షలు తీసుకునేవారు, గోవిందమాల, శివమాల... ఇలా వివిధ మాలల ధారణ చేసేవారు సాధారణంగా కార్తీకమాసంలోనే చేయడం సంప్రదాయం. ఇవన్నీ నియమబద్ధ జీవనానికి మార్గదర్శనం చేస్తాయి. శరీరమే కాదు, అంతఃకరణ కూడా పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. అప్పుడే ఈ మాసంలో ఆచరించే నియమాలకు సార్థకత. – డి.వరలక్ష్మి కార్తీక మాసంలో సాగే వనభోజనాలు మన సంప్రదాయాలను చాటిచెబుతాయి. ‘వనం’ అనే పదానికి ‘అరణ్యాన్ని ప్రేమించడమ’ని అమరకోశం చెబుతుంది. కార్తీకమాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో, విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేసినవారి సకల పాపాలూ తొలగిపోతాయన్నది పురాణంలోని మాట. కార్తీకమాసపు రోజుల్లో బయట గడిపేందుకు వాతావరణం అనువుగా ఉంటుంది. వర్షాలు అప్పటికి తగ్గుముఖం పడతాయి కాబట్టి కీటకాల బెడద కూడా అంతగా ఉండదు. చెట్లన్నీ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. ఆరుబయల్లో అందరూ కలిసి వంటలు వండుకోవడానికైనా, ఔషధ భరితమైన ఉసిరి వంటి చెట్ల గాలిని పీల్చుకోవడాని కైనా వనభోజనాలు సరైన సందర్భాలు. అందరూ కుటుంబాలతో వెళ్లడం, చెట్ల కింద రకరకాల వంటలు వండుకుని తినడం ఒక అనుభవం. అయితే... ఉసిరి చెట్టు ఉన్న వనంలో వనభోజనాలు చేయడం ఆరోగ్యకరం అంటారు పెద్దలు. వినోదం, ఆరోగ్యం, సామాజికం... ఇలా ఏ కోణంలోంచి చూసినా వన భోజనాలకు సాటి మరో సందర్భం కానరాదు! కార్తీక పురాణంలో కూడా వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ సంప్రదాయాన్ని తరచి చూస్తే వనభోజనానికి ఎందుకంత ప్రాధాన్యతో అర్థమవుతుంది. తులసి పూజ.. తులసి ఇంటి ప్రాంగణంలో ఉండటం ఆ ఇంటి వారి సాంప్రదాయ నిష్టను సూచిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున తులసి పూజ చేయాలి. ఆవు నెయ్యితో తడిపిన వత్తులతో దీపాలు వెలిగించాలి. తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి, పరమాన్నం నివేదించాలి. అనంతరం 365 వత్తులతో హారతి ఇవ్వాలి. -
యాదాద్రికి కలిసొచ్చిన కార్తీకం
సాక్షి,యాదగిరికొండ (ఆలేరు) : యాదగిరీశుడికి కార్తీకమాసం కలిసొచ్చింది. పాతగుట్ట, ప్రధానాలయం కలిపి సత్యనారాయణస్వామి వ్రతాలు తదితర అన్ని విభాగాల ద్వారా రూ.6,15,91, 071 ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.30 లక్షల ఆదాయం అధికంగా వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కార్తీక మాసంలో యాదాద్రికి పెరిగిన ఆదాయం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈ ఏడాది కార్తీకమాసంలో గతంలో కంటే ఆదాయం పెరిగింది. యాదగిరిగుట్ట దేవస్థానం వ్రతాలకు పెట్టింది పేరు. యాదాద్రికి సికింద్రాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, బెంగళూరు, రాజమండ్రితోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి సైతం వచ్చి ఇక్కడ వ్రతాలను నిర్వహిస్తారు. అందుకనే యాదాద్రి దేవస్థానం రెందో అన్నవరంగా పేరుగాంచింది. కార్తీకమాసంలో ఎక్కువగా సత్యనారాయణ వ్రతాలను చేయించుకుంటారు. ఈ ఏడాది కార్తీకమాసంలో నెలాఖరు వరకు అంటే 30 రోజులలో మొత్తం 17,921 వ్రతాలు జరిగాయి. అలాగే పాతగుట్టలో సైతం వ్రతాలు పెరిగాయి. గతేడాది 1340 కాగా ఈ యేడాది 1520 వ్రతాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీటిపై స్వామి వారికి పాతగుట్ట, ప్రధానాలయం కలిపి వచ్చిన ఆదాయం రూ.89,60,500 రాగా గతేడాది రూ.87,97,500 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్తీక మాసంలో అన్ని విభాగాల నుంచి ఆదాయం రూ.6,15,91,071 రాగా.. గతేడాది రూ.5,86, 69,307 వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. అంటే మొత్తంగా ఈ ఏడాది దేవస్థానానికి రూ.29,21,764 ఆదాయం పెరిగింది. -
సాగరతీరంలో తప్పిన పెనుప్రమాదం
సాక్షి, కోడూరు(అవనిగడ్డ): కార్తీకమాసాన్ని పురస్కరించుకుని హంసలదీవి సాగరతీరంలో పుణ్యస్నానం చేసేందుకు వచ్చిన ఇద్దరు పర్యాటకులకు శనివారం పెనుప్రమాదమే తప్పింది. సముద్ర అలల ఉధృతికి కొట్టుకుపోతున్న యువతి, చిన్నారిని పాలకాయతిప్ప మెరైన్ హోంగార్డు ప్రాణాలకు తెగించి కాపాడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన మెరుగుమాల శీరిష, వీరిశెట్టి అంజలి, చిట్టిమొతు నందిని, మెరుగుమాల గీతాశ్రీ హంసలదీవి సాగర సంగమం వద్ద కార్తీకస్నానం చేసేందుకు అదే మండలానికి చెందిన లోమ వసంతరావు ఆటోలో వచ్చారు. వీరంతా సముద్రంలో స్నానాలు చేసేందుకు దిగారు. ఉదయం 11.45గంటల సమయంలో సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసి పడడంతో వాటి ఉధృతికి యువతి నందినితో పాటు చిన్నారి గీతాశ్రీ సముద్రం లోపలికి కొట్టుకుపోయారు. ఇది గమనించిన అంజలి, శీరిష కేకలు వేయడంతో అక్కడే ఉన్న పాలకాయతిప్ప మెరైన్ స్టేషన్ హోంగార్డు ఆనంద్‌రాజు లైఫ్‌జాకెట్, రింగులు ధరించి హుటాహుటినా సముద్రంలోకి పరుగులు పెట్టాడు. తన ప్రాణాలకు తెగించి అలల మధ్య కొట్టుకుపోతున్న నందిని, గీతాశ్రీని ఒడ్డుకు చేర్చాడు. అయితే అప్పటికే సముద్ర నీరు తాగేయడంతో ఇద్దరు స్పృహ కోల్పోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే వారిని ఇసుకతిన్నెలపై పడుకోబెట్టి కడుపు నొక్కడంతో తాగిన నీరు మొత్తం కక్కేశారు. పది నిమిషాల తరువాత నందిని, గీతాశ్రీ లేచి కూర్చోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రథమ చికిత్స నిమిత్తం యువతి, చిన్నారిని కోడూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు ఆనంద్‌రాజు -
ఆ బాబాకు ఫుల్ బాటిల్‌తో పూజలు..
-
ఆ బాబాకు ఫుల్ బాటిల్‌తో పూజలు..
ముంబై: దేవతలకు పూలు, పండ్లు, కొబ్బరికాయలు, విరాళాలు, కానుకలు ఇచ్చి కోరికలు కోరుకోవటం ఆనవాయితీ. కానీ ఇక్కడ ఆ వ్యవహారం దారి తప్పింది. బాబా భైరోన్ నాథ్ దేవుడికి భక్తులు మద్యాన్ని బాటిళ్ల కొద్దీ తెచ్చి సమర్పించుకుంటారు. అనంతరం దానినే ప్రసాదంగా తీసుకుంటారు. ముంబై సమీపంలోని చెంబూర్ ఈ విడ్డూరానికి వేదికైంది. చెంబూర్‌లోని ఓ శ్మశానవాటిక వద్ద బాబా భైరోన్ నాథ్ పేరుతో చిన్న ఆలయం ఉంది. ఈ దేవుడిని శివుని అవతారంగా భావిస్తుంటారు భక్తులు. కార్తీక ఏకాదశి నాడు దేశంలోని వివిధ ప్రాంతాలు, మతాలకు చెందిన భక్తులు ఏటా ఇక్కడికి తరలివస్తారు. వస్తూ వస్తూ వెంట విస్కీ, రమ్, వోడ్కా వంటి రకరకాల మద్యం బాటిళ్లను తీసుకువస్తారు. దేవుడికి పూజలు చేసి మద్యాన్ని సమర్పించుకుంటారు. ఆపై తెచ్చిన మద్యాన్ని తీసుకెళ్లి ప్రసాదంగా పంచి పెడతారు. ఇలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని, అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి చెంబూరుకు వలస వచ్చిన తమ కుటుంబీకులు ఈ గుడిని ఇక్కడ ఏర్పాటు చేశారని ఆలయ ప్రధాన పూజారి లోహానా తెలిపారు. దేవుళ్లకు మద్యాన్ని నైవేద్యంగా ఇవ్వటం హిందూ సంప్రదాయంలో కొత్తేమీ కాదని ఆయన చెబుతున్నారు. పురాణాల్లో ఇందుకు సంబంధించి అనేక ఉదాహరణలున్నాయన్నారు. కాగా మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరంలో ఉన్న కాలభైరవ ఆలయంలో కూడా ఇలాంటి వింత ఆచారం ఉంది. ఆ ఆలయ సాంప్రదాయం ప్రకారం భక్తులు ఎన్ని పూలు , పండ్లు సమర్పించినా వారి పూజ పరిపూర్ణం కాదు. ఇక్కడున్న దేవుడికి మద్యం సమర్పిస్తేనే పూజ పరిపూర్నమైనట్టు భావిస్తారు. కొత్తగా ఈ ఆలయ దర్శనానికి వెళ్ళిన భక్తులకు కూడా ఆలయ సాంప్రదాయం చెప్పి ఆలయం బైట విక్రయించే పూజా సామాగ్రిలో మద్యం బాటిల్ కూడా ఇస్తారు. (ఉజ్జయినిలోని కాలభైరవ ఆలయం) దేవుడికి పూజలు చేసి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు -
కార్తీక శోభ..
-
ఆలయాలకు కార్తీక సోమవారం శోభ
-
రికార్డు స్థాయిలో సత్యదేవుడి ఆదాయం
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో కొలువై ఉన్న సత్యనారాయణ స్వామికి కార్తీకమాసంలో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వచ్చింది. వివిధ విభాగాల ద్వారా రికార్డు స్థాయిలో రూ.14.01 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే రూ.2.67 కోట్లు అదనం. అధిక శాతం వ్రతాలు, దర్శనాలు, హుండీల ద్వారా వచ్చింది. భక్తుల తాకిడి, ఆదాయంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడలేదు. చిల్లర ఇబ్బందులతో అధికారులు తీసుకున్న పలు నిర్ణయాలతో ఆదాయం పెరిగింది. రద్దయిన నోట్లు హుండీల ద్వారా ఎక్కువగా వస్తాయని అంచనా వేసినా సాధారణస్థాయిలోనే వచ్చాయి. వ్రతాల ద్వారా రికార్డుస్థాయిలో అంటే రూ.5,35,23,937 సమకూరింది. పెద్ద నోట్ల రద్దుతో చిల్లర సమస్య కారణంగా ఈ నెల 8 నుంచి రూ.150 ల టికెట్లను రద్దు చేశారు. ఇక హుండీ ఆదాయం చూస్తే రికార్డు స్థాయిలో రూ.1.95 కోట్లు వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే రూ. 78 లక్షలు అదనం. అతి తక్కువ విలువైన నోట్లు అధికంగా వచ్చాయి. -
శ్రీశైలంలో భక్తుల రద్దీ
700 పైగా సామూహిక అభిషేకాలు - 55పైగా గర్భాలయ రుద్రాభిషేకాలు - ఆలయ పూజావేళల్లో మార్పు - పాతాళగంగలో పుణ్యస్నానాలు–కార్తీక దీపారాధనలు శ్రీశైలం: కార్తీకమాసం.. శివునికి అత్యంత ప్రీతికరమైన నాలుగవ సోమవారం జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైలం భక్తజన సంద్రంగా మారింది. సుమారు లక్షకు పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. కాగా భక్తుల రద్దీ నేపథ్యంలో ఈఓ నారాయణభరత్ గుప్త వేకువజామున 2గంటలకు మంగళవాయిద్యాలు, 2.30 గంటలకు సుప్రభాతం, 3గంటలకు మహామంగళహారతి, 3.30గంటల నుంచి దర్శన ఆర్జిత సేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు వేకువజామున 2గంటల నుంచే పాతాళగంగ మెట్ల మార్గంలో నదీ తీరం చేరుకుని పవిత్ర కార్తీక స్నానాలను నిర్వహించుకున్నారు. 3.30గంటల నుంచే దర్శనాలు ప్రారంభం కావడంతో ఉచిత ప్రత్యేక దర్శన క్యూలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులతో కిక్కిరిసి కనిపించాయి. అలాగే అభిషేక ప్రియుడైన శ్రీ మల్లికార్జున స్వామివార్లకు సామూహిక అభిషేకాలను నిర్వహించుకోవడానికి భక్తులు వందల సంఖ్యలో టికెట్లను కొనుగోలు చేశారు. ఆన్లైన్, ఒకరోజు ముందస్తు టికెట్లు, కరెంట్ బుకింగ్ ద్వారా సుమారు 750 పైగా అభిషేకం టికెట్లను విక్రయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే స్వామివార్ల గర్భాలయంలో జరిగే శాస్త్రోక్త మంత్రపూరిత రుద్రాభిషేకానికి సైతం భక్తులు రూ.5వేల టికెట్ ఖర్చుకు వెనుకాడకుండా 55 పైగా అభిషేకాలను నిర్వహించుకున్నారు. కార్తీక దీపారాధనలు– వ్రతనోములు కార్తీకమాసం నాలుగవ సోమవారం సందర్భంగా ప్రధాన మాడా వీధుల్లోని రథశాల వద్దనున్న గంగాధర మండపం చుట్టూ వందల సంఖ్యలో భక్తులు పవిత్ర పుణ్య స్నానాలాచరించుకుని కార్తీక దీపారాధనలు, వ్రతనోములను శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట, ఉసిరిచెట్ల సముదాయం వద్ద మల్లన్న దర్శనానంతరం భక్తులు కార్తీక దీపాలను వెలిగించి ఉపవాస దీక్షలను విరమించారు. లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాల్లో భక్తుల రద్దీ స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం భక్తులు అమ్మవారి ఆలయం వెనుకనున్న లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద లడ్డూ, పులిహోర ప్రసాదాల కోసం బారులు తీరారు. గతంలో అమ్మవారి ఆలయం వెనుక రెండు ప్రసాదాల విక్రయ కేంద్రాలు ఉండేవి. అయితే ఇటీవల ఎస్బీహెచ్ నిర్వహించే ఒక ప్రసాద విక్రయ కేంద్రాన్ని ల్యాండ్ స్కేపింగ్ కోసం కూల్చి వేయడంతో ఉన్న ఒక్క ప్రసాద విక్రయ కేంద్రం వద్ద భక్తుల తాకిడి పెరిగి క్యూలన్నీ పోటెత్తాయి. -
ఆహ్లాదం..ఆనందం..ఆత్మీయం
- జిల్లా అధికారుల వనభోజనం – ఉత్సాహంగా పాల్గొన్న కలెక్టర్, ఆయన సతీమణి కర్నూలు(అగ్రికల్చర్): ఒకవైపు తుంగభద్ర నది... మరోవైపు నీటితో తొణికిసలాడుతున్న చెరువు.. మధ్యలో పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతవరణంలో జిల్లా అధికారుల కార్తీకవనమహోత్సవం కనుల పండువగా జరిగింది. ఆటాపాటా, విందువినోదాలతో ఈ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. శుక్రవారం కర్నూలు మండలంలోని గర్గేయపురం నగరవనంలో జిల్లా అధికారుల కార్తీకవన మహోత్సవం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సాగింది. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖఅ అధికారులు కార్తీకవనమహోత్సవానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులను నగరవనానికి తీరలించేందుకు ప్రత్యేకంగా రెండు సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేవారు. నగర వనం అందాలను చూసి అందనూ మురిసిపోయారు. వనం చుట్ట రింగ్ రోడ్డు తరహాలో రోడ్డు వేశారు. ఉసిరి చెట్టుకు పూజలు.. కలెక్టర్ సతీమణి సత్యరేఖ తొలుత ఉసిరి చెట్టుకు పూజచేసి కార్తీకవనమహోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సహా పలువురు జిల్లా అధికారులు సతీమణులతో సహా పాల్గొన్నారు. దాండియా ఆట ఆడి సందడి చేశారు. జిల్లా అధికారుల కూతుళ్ల నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్తీక వనభోజనం ముగిసిన తర్వాత నిర్వహించిన వివిధ కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలకు, జిల్లా అధికారులకు వేరువేరుగా తాడులాగడం, వాల్‌బాల్ పోటీలు నిర్వహించారు. మహిళలల్లో కలెక్టర్ సతీమణి ఒక జట్టుగా, డీఆర్ఓ సతీమణి మరో జట్టుగా పోటీలు జరిగాయి.వాలీబాల్ పోటీల్లో కలెక్టర్ సతీమణి జట్టు విజయం సాధించగా, తాడులాగే పోటీల్లో కలెక్టర్ జట్టు విజయం సాధించింది. జిల్లా అధికారుల పిల్లలకు ప్రత్యేకంగా ఆటలపోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్స్, అంత్యాక్షరి వంటి కార్యక్రమాలు ఆహ్లాదకరంగా జరిగాయి. ఎంత హాయిలే ఇలా.. గార్గేయపురం చెరువులో అధికారులు, వారి సతీమణులు బోటు షికారు చేశారు. ఇందుకోసం జిల్లా పర్యాటక సంస్థ అధికారులు ప్రత్యేకంగా సంగమేశ్వరం నుంచి బోట్లు తెప్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆహ్లాదకరమైన వాతవరణంలో కార్తీక వనమహోత్సవాన్ని నిర్వహించడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. నగరవనాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు స్పష్టం చేశారు. కర్నూలు నగర ప్రజలు వారాంతంలో ఇక్కడకు వచ్చి సంతోషంగా గడిపే విధంగా అబివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు,జడ్సీ సీఇఓ ఈశ్వర్, సీపీఓ ఆనంద్‌నాయక్, ఇరిగేషన్ ఎస్ఇ చంద్రశేఖర్‌రావు, డ్వామా పీడీ పుల్లారెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ప్రత్యేకకలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, డీఎస్ఓ తిప్పేనాయక్ , కర్నూలు ఆర్డీఓ రఘుబాబు దాదాపు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
డిసెంబర్ రెండో వారంలోకందనవోలు సంబరాలు
– 10, 11 తేదీల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహణ కర్నూలు(అగ్రికల్చర్) : కందనవోలు సంబరాలు డిసెంబర్ రెండో వారంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం తన చాంబర్లో కందనవోలు సంబరాలపై సమీక్ష నిర్వహించారు. ముందుగా కార్తీక మాసం ముగిసేలోపు కందనవోలు సంబరాలను నిర్వహించాలని నిర్ణయించగా..తాజాగా డిసెంబర్ 10, 11 తేదీల్లో నిర్వహించే విధంగా తాత్కాలికంగా జేసీ ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయించింది. ఈ ఉత్సవాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబును ఆదేశించారు. పూర్తి స్థాయి ప్రణాళికను తయారు చేయాలని కమిటీ ప్రతినిధులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థ డీవీఎం బాబ్జీ పాల్గొన్నారు. -
6న ఆర్.కృష్ణయ్య రాక
కర్నూలు(అర్బన్): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈ నెల 6వ తేదీన కర్నూలుకు రానున్నట్లు బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాంబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగర శివారులోని వెంగన్నబావి వద్ద ఉదయం 11 గంటలకు కార్తీక మాస వసభోజన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని బీసీ వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించామన్నారు. కార్తీక మాసంలో వివిధ కులాలకు చెందిన వనభోజనాలు జరగడం సాంప్రదాయమని, బీసీల్లోని అన్ని కులాలకు చెందిన నేతలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగానే తొలి సారి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. -
కార్తీక దీపం
-
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని తమ శాఖ పరిధిలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని ఆ శాఖ అసిస్టెంట్ కమీషనర్ సీహెచ్ దుర్గా ప్రసాద్ తెలిపారు. జిల్లాలో తమ శాక పరిధిలో 257 శైవ క్షేత్రాలున్నాయని, వాటన్నింటిలో కార్తీక సోమవారాలు, మంగళవారాలు, కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు, రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, అమ్మవార్లకు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించాలని ఇప్పటికే ఆయా ఆయా ఆలయాల కార్యనిర్వహణాధికారులను ఆదేశించామన్నారు. అలాగే విశేష ప్రాముఖ్యత కలిగిన పోలవరంలోని శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానం, గునుపూడిలోని శ్రీ సోమేశ్వర, జనార్థన స్వామివార్ల దేవస్థానం, ఆచంటలోని శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం, లక్ష్మణేశ్వర పురంలోని శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి దేవస్థానం, జుత్తిగలోని శ్రీ ఉమా వాసుకిరవి సోమేశ్వర స్వామి దేవస్థానం, కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం, నత్తారామేశ్వరంలోని శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉన్నందున వారికి మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, దర్శనాలకు, అభిషేకాలకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. -
కృష్ణా నదికి పోటెత్తిన భక్తులు
కార్తీకమాసం ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు శనివారం వేకువజాము నుంచి భక్తులు కృష్ణానది వద్ద పోటెత్తారు. భక్తుల తాకిడిని పురస్కరించుకుని ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించి కృష్ణా నదిలో వదిలారు. -
మహానందిలో భక్తుల కిటకట
కార్తీక మాసం కావడంతో శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడాయి. కార్తీక సోమవారం సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. కర్నూలు జిల్లా మహానందిలో వెలిసిన మహానందీశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో.. ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.