కృష్ణా నదిలో వైభవంగా కార్తీక దీపోత్సవం.
కార్తీకమాసం ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు శనివారం వేకువజాము నుంచి భక్తులు కృష్ణానది వద్ద పోటెత్తారు. భక్తుల తాకిడిని పురస్కరించుకుని ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించి కృష్ణా నదిలో వదిలారు.