దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
Published Mon, Oct 31 2016 5:52 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని తమ శాఖ పరిధిలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని ఆ శాఖ అసిస్టెంట్ కమీషనర్ సీహెచ్ దుర్గా ప్రసాద్ తెలిపారు. జిల్లాలో తమ శాక పరిధిలో 257 శైవ క్షేత్రాలున్నాయని, వాటన్నింటిలో కార్తీక సోమవారాలు, మంగళవారాలు, కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు, రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, అమ్మవార్లకు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించాలని ఇప్పటికే ఆయా ఆయా ఆలయాల కార్యనిర్వహణాధికారులను ఆదేశించామన్నారు. అలాగే విశేష ప్రాముఖ్యత కలిగిన పోలవరంలోని శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానం, గునుపూడిలోని శ్రీ సోమేశ్వర, జనార్థన స్వామివార్ల దేవస్థానం, ఆచంటలోని శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం, లక్ష్మణేశ్వర పురంలోని శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి దేవస్థానం, జుత్తిగలోని శ్రీ ఉమా వాసుకిరవి సోమేశ్వర స్వామి దేవస్థానం, కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం, నత్తారామేశ్వరంలోని శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉన్నందున వారికి మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, దర్శనాలకు, అభిషేకాలకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.
Advertisement
Advertisement