endoment
-
అన్యాక్రాంతమైన భూమి స్వాధీనం
పెనుగుదురు (కరప): దశాబ్ద కాలంగా అన్యాక్రాంతమైన పంటభూమిని ఎట్టకేలకు ట్రిబ్యునల్ తీర్పుతో దేవాదాయశాఖ సోమవారం స్వాధీనం చేసుకుంది. పెనుగుదురులోని వేణుగోపాలస్వామి దేవస్ధానానికి సంబంధించిన 1.45 ఎకరాల పంటభూమిని ఒకవ్యక్తి అనధికారికంగా సాగు చేసుకుంటున్నాడు. ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినా, కుదరక పోవడంతో దేవాదాయశాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ తీర్పు దేవాదాయశాఖకు అనుకూలంగా వచ్చింది. దీంతో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్‌బాబు పలువురు ఈఓలు, సిబ్బందితోపాటు వీఆర్వోలు, పోలీసు బందోబస్తుతో వెళ్లి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. చుట్టూ పెన్సింగ్ ఏర్పాటుచేసి, ఎర్రజెండాలుపాతి, దేవాదాయశాఖకు చెందిన భూమిగా బోర్డును ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా డీసీ రమేష్‌బాబు మాట్లాడుతూ 20 రోజుల వ్యవధిలోనే మూడేళ్ల కాలపరిమితికి కౌలుహక్కుకోసం బహిరంగ వేలంపాట నిర్వహిస్తామన్నారు. ఆసక్తిఉన్న రైతులు రూ.10వేలు డిపాజిట్ చెల్లించి, వేలంపాటలో పాల్గొనవచ్చన్నారు. వెంటనే బహిరంగ వేలంపాటకు ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఇన్స్పెక్టర్ డేగల సతీష్‌కుమార్‌ను డీసీ ఆదేశించారు. కరప ఎస్ఐ మెల్లం జానకీరాం ఆధ్వర్యంలో ఏఎస్ఐ కేఏవీఎస్ఎస్ ఆచార్యులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
సెలవులో డీసీ గాయత్రి దేవి
కర్నూలు(న్యూసిటీ) : దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉపకమిషనర్ బి.గాయత్రి దేవి శుక్రవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు సెలవుపై వెళ్లారు. కర్నూలు సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు ఇన్చార్జిగా ఉంటారు. ఈ మేరకు కమిషనర్ వై.వి.అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలంలో ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు ఇన్చార్జి ఈఓగా గంజి మల్లికార్జున ప్రసాద్‌ను నియమించారు. -
దేవాదాయశాఖ స్థలంలో అన్యమత ప్రచారం
పాక తొలగింపులో ఉద్రిక్తత కాకినాడ రూరల్ : దేవాదాయ ధర్మాదాయశాఖకు చెందిన భూమిని లీజుకు తీసుకుని ఆ భూమిని అన్యమత ప్రచారానికి వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుపై గురువారం దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులు భూమిలో వేసిన పాకలను తొలగించేందుకు ప్రత్నించగా లీజుదారులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పంచాయతీ సర్వేనంబర్లు 102/1ఏ, 1బి, 1సిల్లో కాకినాడ అన్నదాన సమాజానికి చెందిన 8.41 ఎకరాల స్థలం దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధీనంలో ఉంది. ప్రతి మూడేళ్లకు అందులో ఫలసాయం అనుభవించేందుకు, తోటలు నిర్వహణకు లీజుకిస్తుంటారు. అందులో భాగంగా 2016–18 ఆర్థిక సంవత్సరానికి వన్నెపూడి వెంకటరమణ లీజుకు తీసుకున్నారు. ఈ స్థలంలో క్రైస్తవ సభలు నిర్వహిస్తున్నారని, విద్యార్థులతో క్రైస్తవ తరగతులు నిర్వహిస్తున్నారని కొందరు దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులకు, హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలో పాకలను తొలగిస్తే లీజును కొనసాగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయినా వెంకటరమణ ఆ స్థలంలో పాకను తొలగించకుండా జాప్యం చేయడంతో రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ఆజాద్ ఆదేశాల మేరకు గ్రేడ్–1 ఈవో ఎస్ రాధ నాయకత్వంలో ఈవోలు వుండవిల్లి వీర్రాజుచౌదరి, నరసింహరాజు, రమణమూర్తి, రాజేశ్వరరావు, సూర్యనారాయణ పాకను తొలగించే ప్రయత్నం చేశారు. సగభాగం కూల్చే సమయానికి లీజుదారుడు కొందరు వ్యక్తులతో వచ్చి పాకను తొలగించొద్దని, వచ్చే ఏడాది వరకు లీజు ఉందని, దీనికి సంబంధించి కోర్టు ఆర్డరు కూడా ఉందంటూ వాదనకు దిగారు. దీనిపై అధికారులు స్పందించి కోర్టు ఆర్డర్ ప్రకారం ఎన్నిసార్లు హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతో లీజును రద్దు చేయడం జరిగిందని, స్థలాన్ని తాము స్వాధీనం చేసుకుంటున్నామని వివరించారు. లీజు రద్దు చేస్తున్నట్లు కోర్టు ఆర్డర్ ఇవ్వలేదని, కేవలం పాకను మాత్రమే తొలగించమని ఇచ్చిందని లీజుదారుడైన వెంకటరమణ, అతనితో పాటు వచ్చిన కొందరు వాదనకు దిగారు. దీంతో అధికారులు రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్‌ఆజాద్‌తో మాట్లాడారు. రెండు రోజుల్లో పాకను తొలగిస్తామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని లీజుదారుడు అధికారులకు , రాతపూర్వకంగా ఇవ్వడంతో అధికారులు ఆమోదించారు. లీజుదారుడు అన్యమత ప్రచారాలకు వినియోగించకుంటే కోర్టు తీర్పు ప్రకారం లీజు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. సర్పవరం పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని తమ శాఖ పరిధిలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని ఆ శాఖ అసిస్టెంట్ కమీషనర్ సీహెచ్ దుర్గా ప్రసాద్ తెలిపారు. జిల్లాలో తమ శాక పరిధిలో 257 శైవ క్షేత్రాలున్నాయని, వాటన్నింటిలో కార్తీక సోమవారాలు, మంగళవారాలు, కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు, రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, అమ్మవార్లకు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించాలని ఇప్పటికే ఆయా ఆయా ఆలయాల కార్యనిర్వహణాధికారులను ఆదేశించామన్నారు. అలాగే విశేష ప్రాముఖ్యత కలిగిన పోలవరంలోని శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానం, గునుపూడిలోని శ్రీ సోమేశ్వర, జనార్థన స్వామివార్ల దేవస్థానం, ఆచంటలోని శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం, లక్ష్మణేశ్వర పురంలోని శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి దేవస్థానం, జుత్తిగలోని శ్రీ ఉమా వాసుకిరవి సోమేశ్వర స్వామి దేవస్థానం, కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం, నత్తారామేశ్వరంలోని శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉన్నందున వారికి మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, దర్శనాలకు, అభిషేకాలకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. -
నేడు చేర్వుగట్టుకు దేవాదాయ శాఖ మంత్రి రాక
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంలు గురువారం అమావ్యాస సందర్భంగా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు దేవాలయ ఈఓ గుంత మనోహర్‌రెడి ్డ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.