annavaram satyanarayana swamy temple
-
సత్యదేవుని సన్నిధిలో ఆకాశ దీపం
-
అన్నవరం: కన్నుల పండువగా సత్యదేవుని కల్యాణం (ఫొటోలు)
-
అన్నవరం: కన్నుల పండువగా సత్యదేవుని కల్యాణం (ఫొటోలు)
అన్నవరం: కన్నుల పండువగా సత్యదేవుని కల్యాణం (ఫొటోలు) -
సత్యదేవుని సన్నిధిలో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు
విజయనగరం: అన్నవరం సత్యనారాయణ స్వామిని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పుష్పాంజలి దంపతులు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పద్మావతి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వారితో పాటు నూతన వధూవరులు సిరి సహస్ర, ప్రదీప్, ఇతర కుటుంబసభ్యులు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో ఉన్న స్వామివారిని వారంతా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
కన్నులపండుగగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం
-
సత్యదేవుడి ప్రసాదం ముప్పావుగంటలో సిద్ధం
అన్నవరం: సత్యదేవుని గోధుమ నూక ప్రసాదాన్ని యంత్రాల ద్వారా తయారు చేయడానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియ కొత్త భవనంలో మొదలైంది. తొలి కళాయిలో 80 కిలోల ప్రసాదం తయారైంది. స్వామికి నివేదన సమర్పించాక ప్యాకింగ్ సిబ్బంది 150 గ్రాముల చొప్పున విస్తర్లలో ప్యాక్ చేసి, విక్రయ కౌంటర్లకు పంపించారు. మంగళవారం భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుందని, 98 కళాయిల్లో 7,930 కిలోల ప్రసాదం తయారు చేశామని అధికారులు తెలిపారు. ప్రసాదం తయారీ ఇలా.. తొలుత వంద డిగ్రీల సెల్సియస్ వేడినీరు 40 లీటర్లు గొట్టం ద్వారా కళాయిలో పడింది. అందులో 35 కిలోల గోధుమ నూక మరో గొట్టం ద్వారా, ఇంకో గొట్టం ద్వారా రెండు విడతలుగా 30 కిలోల పంచదార పడ్డాయి. ప్రసాదం ఉడికిన తర్వాత ఆరు కిలోల నెయ్యి, 150 గ్రాముల యాలకుల పొడిని సిబ్బంది కలిపారు. కళాయికి ఇరువైపులా ఉన్న చక్రాలను ముందుకు వంచడం ద్వారా ప్రసాదం మరో తొట్టెలో పడింది. ప్యాకింగ్ సమయంలో మరికొంత నెయ్యి కలుపుతామని సిబ్బంది తెలిపారు. ఈ తయారీ ప్రక్రియ 45 నిమిషాల్లో ముగియడం ఆశ్చర్యం కలిగించింది. భవన దాత మట్టే సత్యప్రసాద్ చొరవ తీసుకుని యంత్రాల పనితీరు పర్యవేక్షణకు నలుగురు టెక్నీషియన్లను పంపించారు. దేవస్థానం పీఆర్ఓ కె.కొండలరావు, ఈఈ వి.రామకృష్ణ, ఆలయ ఏఈఓ డీవీఎస్ కృష్ణారావు తదితరులు ప్రసాద తయారీని పరిశీలించారు. యంత్రాలకు సమీపాన ప్యాకింగ్ చేస్తుండడంతో కొంచెం వేడి వస్తోందని సిబ్బంది తెలిపారు. కుకింగ్, ప్యాకింగ్‌ల మధ్యన అడ్డంగా అద్దాలు అమర్చి, అదనంగా ఫ్యాన్లు బిగించేలా చూస్తామని భవన దాత సత్యప్రసాద్ వారికి హామీ ఇచ్చారు. ఆలయ సూపరింటెండెంట్ బలువు సత్యశ్రీనివాస్, ప్రసాదం సూపరింటెండెంట్ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ బండారు వేంకట రమణ తదితరులు ప్రసాదం తయారీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తయారీ సులభం ప్రసాదం తయారీ సులభంగా ఉంది. నలుగురు రెగ్యులర్, నలుగురు ఔట్సోర్సింగ్ సిబ్బంది తయారు చేస్తున్నారు. ఏకకాలంలో 20 కళాయిల ద్వారా కూడా ప్రసాదం తయారు చేయవచ్చు. - పీఎస్‌ఎస్‌వీ ప్రసాదరావు, ప్రసాదం హెడ్ కుక్ ప్యాకింగ్ వేగం ప్రసాదం ప్యాకింగ్ కూడా వేగంగా జరుగుతోంది. తయారీకి, ప్యాకింగ్ చేసే ప్రదేశం దగ్గరగా ఉండడంతో కొంత వేడి వస్తోంది. దీంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. వేడి రాకుండా ఏర్పాట్లు చేయాలి. - వీవీఎస్ కుమార్, సీనియర్ ప్యాకర్ -
కరోనా ఎఫెక్ట్: అన్నవరం దేవస్థానం కీలక ప్రకటన
సాక్షి, కాకినాడ: కరోనా వైరస్ ప్రభావం దేవుళ్లపై కూడా పడింది. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో అన్నవరం ఆలయానికి వచ్చే భక్తులకు అన్నవరం దేవస్థానం కీలక సూచనలు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే తిరుమల,శ్రీశైలం లాంటి ప్రముఖ పుణ్య క్షేత్రాలు కరోనా నివారణకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు కొన్ని కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా అన్నవరం సత్యదేవుని దేవస్థానం కూడా కీలక సూచనలు చేసింది. (కంగారెత్తిస్తున్న కరోనా) సత్యనారాయణ స్వామి వ్రతమాచరించే భక్తులు తమ వెంట 12 సంవత్సరాల లోపు చిన్నారులు, ఆరవై ఏళ్ల పైబడిన వృద్ధులను తీసుకురావద్దని అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు కోరారు. మొక్కులను మూడు వారాల పాటు వాయిదా వేసుకోవాలని ఈవో సూచించారు. విదేశాల నుంచి స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని మూడు వారాల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉండటంతో ప్రత్యేక చర్యల్లో భాగంగానే ముందు జాగ్రత్త చర్యగా సూచనలు చేశామని.. భక్తులు గమనించాలని ఆలయ ఈవో కోరారు. (ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తొలి బాధితుడు) -
నేటి నుంచి సత్యదేవుని కళ్యాణోత్సవాలు
-
సత్యదేవుని కళ్యాణోత్సవాలు
-
రికార్డు స్థాయిలో సత్యదేవుడి ఆదాయం
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో కొలువై ఉన్న సత్యనారాయణ స్వామికి కార్తీకమాసంలో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వచ్చింది. వివిధ విభాగాల ద్వారా రికార్డు స్థాయిలో రూ.14.01 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే రూ.2.67 కోట్లు అదనం. అధిక శాతం వ్రతాలు, దర్శనాలు, హుండీల ద్వారా వచ్చింది. భక్తుల తాకిడి, ఆదాయంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడలేదు. చిల్లర ఇబ్బందులతో అధికారులు తీసుకున్న పలు నిర్ణయాలతో ఆదాయం పెరిగింది. రద్దయిన నోట్లు హుండీల ద్వారా ఎక్కువగా వస్తాయని అంచనా వేసినా సాధారణస్థాయిలోనే వచ్చాయి. వ్రతాల ద్వారా రికార్డుస్థాయిలో అంటే రూ.5,35,23,937 సమకూరింది. పెద్ద నోట్ల రద్దుతో చిల్లర సమస్య కారణంగా ఈ నెల 8 నుంచి రూ.150 ల టికెట్లను రద్దు చేశారు. ఇక హుండీ ఆదాయం చూస్తే రికార్డు స్థాయిలో రూ.1.95 కోట్లు వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే రూ. 78 లక్షలు అదనం. అతి తక్కువ విలువైన నోట్లు అధికంగా వచ్చాయి. -
మంత్రి ప్రత్తిపాటి పీఎస్‌గా వేంకటేశ్వర్లు
అన్నవరం : అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ఈఓ పి.వేంకటేశ్వర్లును ఆయన మాతృసంస్థ రెవెన్యూ శాఖకి సరెండర్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. దాంతో బాటు ఆయనను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యక్తిగత కార్యదర్శిగా నియమించింది. ఈ విషయాన్ని ఈఓ వేంకటేశ్వర్లు గురువారం రాత్రి ‘సాక్షి’కి ధృవీకరించారు. ఈఓగా వేంకటేశ్వర్లు సుమారు రెండేళ్లు పనిచేశారు. సుమారు 150 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనం రూ.తొమ్మిదివేలకు, పల్లకీబోయీలకు వేతనాన్ని రూ.ఎనిమిదివేలకు పెంచిన వేంకటేశ్వర్లు వారి శ్రమను గుర్తించిన ఈఓగా పేరొందారు. అయితే ఇటీవల వివాహాల సీజన్లో దేవస్థానం అధికారుల తప్పుడు సలహాలతో పెళ్లిబృందాలకు గదులు ఇచ్చే విషయంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. మొత్తం మీద దేవస్థానంలో నిజాయితీపరుడైన అధికారిగా పేరు పొందారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో దేవస్థానం మాస్టర్‌ప్లాన్‌పై ఏర్పాటైన సమావేశంలో పాల్గొంటానని, శనివారం అన్నవరం వస్తానని వేంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. కాగా ఆయన స్థానంలో దేవస్థానం ఈఓగా ఇంకా ఎవరినీ నియమించలేదు. ఇక్కడ ఏసీగా పనిచేస్తున్న ఈరంకి జగన్నాథరావును లేదా కాకినాడ ఆర్జేసీ, డీసీలలో ఒకరిని కొద్దికాలం ఇన్‌ఛార్జి ఈఓగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఈఓ వేంకటేశ్వర్లు సోమవారం రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. ఈఓగా రావాలని పలువురి ఆరాటం ఈఓ వేంకటేశ్వర్లు బదిలీ విషయం తెలియడంతో పలువురు దేవాదాయశాఖ అధికారులు ఆ స్థానంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక్కడ గతంలో ఈఓగా పనిచేసిన ఎం.రఘునాథ్, సింహాచలం దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్, గుంటూరు ఆర్జేసీ, విజయవాడ దుర్గగుడి ఈఓ పి.త్రినాథ్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో రఘునాథ్‌కే అధికార పార్టీ ప్రముఖుల మద్దతు ఎక్కువగా ఉందని సమాచారం.