
సాక్షి, శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): హీరో మంచు మనోజ్‌తో త్వరలో ప్రతిష్టాత్మక చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత, నటుడు మోహన్‌బాబు ప్రకటించారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలో మనోజ్‌తో రూ.60 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రం నిర్మించనున్నట్లు ప్రకటించారు. దైవ సన్నిధిలో సినిమా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.
చదవండి: అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క