సత్తెన్నా.. సత్రానికి చేరేదెలా? | satya deva satrams problems | Sakshi
Sakshi News home page

సత్తెన్నా.. సత్రానికి చేరేదెలా?

Published Sat, Oct 15 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

సత్తెన్నా.. సత్రానికి చేరేదెలా?

సత్తెన్నా.. సత్రానికి చేరేదెలా?

  • హరిహర సదన్‌ సత్రం సత్యగిరిపైన... గదులిచ్చే కార్యాలయం రత్నగిరిపైన..
  • రెండు గిరుల మధ్య దూరం 1.5 కిలోమీటర్లు
  • దేవస్థాన వాహనం లేక ఇబ్బందులు 
  • బస చేసే భక్తులకు తప్పని ఇబ్బందులు
  •  
    అన్నవరం దేవస్థానం సత్రాల్లో ఉండాలనుకునే భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రత్నగిరిపై ఉండేవారు సరే ... సత్యగిరిపై ఉండేవారు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారు.  సంబంధిత అధికారులకు ఈ ఇబ్బందులు తెలిసినా పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
     
    అన్నవరం :
    సత్రాలు ఓ వైపు ... ఈ సత్రాలకు రశీదులు ఇచ్చే కార్యాలయం మరో వైపు ... ఈ రెండింటికీ దూరం ఒకటిన్నర కిలోమీటరు. దీంతో భక్తులు ఇబ్బందులు తారాస్థాయికి చేరుకుం టున్నాయి. అన్నవరం దేవస్థానంలో సత్యగిరిపై నిర్మిం చిన హరిహర సత్రం ఉంది. ఈ సత్రంలో బస చేయాలంటే రత్నగిరిపైనున్న గదుల రిజర్వేషన్‌ కార్యాలయంS(సీఆర్‌ఓ ఆఫీసు)కు  వెళ్లి రుసుం చెల్లించి రశీదు పొందాలి. ఆ రశీదు కోసం 1.5 కిలోమీటరు దూరం వెళ్లాల్సిందే. ఆటోల్లో వెళ్దామన్నా అందుబాటులో లేని పరిస్థితి.
     
    రూ.20 కోట్లతో నిర్మించిన సత్రం...
    అన్నవరం దేవస్థానంలోని రత్నగిరిపై గల ఆరు సత్రాల్లో దాదాపు 350 గదులున్నాయి. సత్యగిరిపై ఉన్న హరిహర సదన్‌ను రూ.20 కోట్ల వ్యయంతో 135 గదులతో (వీటిలో 84 గదులు ఏసీ)...   
    అధునాతన హంగులతో  ... ఐదు అంతస్తుల్లో ,  రెండు లిఫ్ట్‌లతో నిర్మించారు. ఈ సత్రంలో నాన్‌ ఏసీ గది అద్దె రూ.600 కాగా, ఏసీ గది రూ.950. సత్రంలో గదులన్నీ నిండితే రోజుకి రూ.1.10 లక్షలు ఆదాయం వస్తుంది. ఈ సత్రానికి చేరుకోవడానికి దేవస్థానం బస్సులు కానీ, మరే ఇతర వాహనాల సదుపాయం లేదు. దీంతో సొంత వాహనాలు లేని భక్తులు ప్రయివేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా ఆటో డ్రైవర్లు భక్తుల్ని ఆ సత్రానికి తీసుకువెళ్లడానికి రూ.50 నుంచి రూ.100 వరకూ వసూలు చేస్తున్నారు.
     
    టీ, టిఫిన్‌ కావల్సినా రత్నగిరికి రావల్సిందే..
    హరిహరసదన్‌ సత్రంలో బస చేసే భక్తులు టీ, టిఫిన్‌ కోసం 1.5 కిలోమీటర్‌ దూరంలోని రత్నగిరి కొండమీదకు రావల్సిందే. లేదంటే రత్నగిరి నుంచి ఆటోను రప్పించుకోవల్సిందే. వచ్చి ... రత్నగిరికి వెళ్లి మళ్లీ సత్రానికి వెళ్లాలంటే మూడు ట్రిప్పులవుతుంది. దీంతో రూ.వంద నుంచి రూ.150 వరకూ వసూలు చేస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటలు నుంచి ఉదయం ఆరు గంటల వరకూ కొండదిగువ నుంచి మీదకు ఆటోలు అనుమతించకపోవడంతో మరిన్ని ఇక్కట్లు తప్పడం లేదు. 
    రెండు వాహనాలు సత్యగిరికి నడపాల్సిందే...
    రత్నగిరి సీఆర్‌ఓ కార్యాలయం నుంచి సత్యగిరిపై గల హరిహర సదన్‌ సత్రానికి టాటా మేజిక్‌లాంటి వాహనాలను రెండింటిని ప్రతిరోజూ నడిపేలా దేవస్థానం చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఒక వాహనం సీఆర్‌ఓ కార్యాలయం వద్ద, మరో వాహనం హరిహర సదన్‌ సత్రం వద్ద ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ఇందుకుగాను ఒక భక్తుని వద్ద నుంచి ఎంత వసూలు చేయాలో దేవస్థాన మే నిర్ణయించాలని, లేదా సీజన్, అన్‌సీజన్‌ అనే బేధం లేకుండా దేవస్థానమే రత్నగిరి నుంచి సత్యగిరికి ఉచిత బస్సు నడపాలని భక్తులు కోరుతున్నారు.
     
    రాత్రి వేళల్లో రత్నగిరి సత్రాల్లో గదులు కేటాయించాలని ఆదేశించాం
    హరిహరసదన్‌ సత్రానికి వెళ్లేందుకు ఉన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని సొంత వాహనాలు ఉన్న భక్తులకే ఆ సత్రంలో గదులు కేటాయించాలని సిబ్బందిని ఆదేశించామని ఈఓ కె.నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. రాత్రి వేళల్లో అయితే రత్నగిరి సత్రాల్లోనే గదులు ఇవ్వాలని చెప్పామన్నారు. భక్తులు రద్దీ అధికంగా ఉన్నప్పుడు దేవస్థానం బస్సును ఉచితంగా సత్యగిరికి నడుపుతున్నాం. రెగ్యులర్‌గా నడిపే విషయం కూడా పరిశీలిస్తామన్నారు.
    – కె. నాగేశ్వరరావు, ఆలయ ఈఓ
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement