కర్నూలు: కర్నూలు జిల్లా బేతంచర్ల మండల పరిధిలోని శ్రీ మద్దిలేటి స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తయింది. శుక్రవారం జరిగిన ఈ లెక్కింపులో హుండీ ఆదాయం 21 లక్షలుగా తేలింది. గత సంవత్సరం నవంబర్ 15 నుంచి ఇప్పటివరకు భక్తులు సమర్పించిన దానాలతో పాటు, జనవరిలో జరిగిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఆదాయం కూడా ఇందులో ఉంది.
(బేతంచర్ల)