పొరపాటుగా హుండీలో పడిన వైనం
హుండీ లెక్కింపు సమయంలో
తిరిగి ఇస్తారని వెళితే మిగిలింది నిరాశే
సేలం(తమిళనాడు): ఆలయ హుండీలో పొరపాటుగా ఏది పడినా అది దేవుడికే సొంతమని పలు సినిమాల్లో సన్నివేశాలు మనం చూసి ఉంటాం. అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులోని తిరుపూర్‌లో చోటుచేసుకుంది. తిరుపోరూర్‌లోని మురుగన్ ఆలయానికి గత రెండు నెలల క్రితం చెన్నై అంబత్తూరుకు చెందిన దినేష్ దర్శనానికి వెళ్లాడు.
ఆ సమయంలో దినేష్ హుండీలో కానుకలు వేస్తున్న సమయంలో పొరపాటుగా ఆయన చేతిలో ఉన్న ఐఫోన్ కూడా హుండీలో పడిపోయింది. ఈ విషయంగా ఆయన హిందూ దేవదాయ శాఖకు ఫిర్యా దు చేయగా, హుండీ లెక్కింపు సమయంలో తె లుపుతామని నిర్వాహకులు చెప్పి పంపించారు. ఈ స్థితిలో గురువారం ఆలయ హుండీని తెరి చారు.
iPhone accidentally fell into the temple's hundi..
The temple administration refused to return it the owner, saying it belonged to the temple.pic.twitter.com/4VgfcRk0Ib— Vije (@vijeshetty) December 20, 2024
ఈ సందర్భంగా దినేష్‌కు సమాచారం ఇవ్వడం తన ఫోన్ తీసుకోవచ్చని ఎంతో ఆశగా ఆలయానికి వెళ్లాడు. హుండీ తెరిచిన ఆలయ నిర్వాహకులు దినేష్‌కు ఐఫోన్ చెందదని, హుండీలో ఏది పడినా మురుగనార్పణమేనని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందాడు. తర్వాత చేసేది లేక తన ఐఫోన్‌లో సిమ్‌కార్డును తీసుకుని, స్వామిని దర్శించుకుని నిరాశతో వెళ్లిపోయాడు.
Year Ender 2024: ముఖ్యాంశాల్లో మహిళా నేతలు
Comments
Please login to add a commentAdd a comment