Tamil Nadu temple
-
9 నిమ్మకాయలు 68 వేల రూపాయలు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని మురుగన్ ఆలయంలో నిర్వహించిన వేలం పాటలో 9 నిమ్మకాయలు రూ. 68,100 పలికాయి. విల్లుపురం జిల్లా ఒట్టనందల్ గ్రామంలోని పురాతన రత్నవేల్ మురుగన్ ఆలయంలో ఏటా 10 రోజుల పాటు కావడి ఉత్సవాలను నిర్వహిస్తారు. 11వ రోజు అర్ధరాత్రి ముగింపు కార్యక్రమంలో పది రోజుల పాటు మురుగన్ వద్ద శూలానికి గుచ్చి ఉంచే 9 నిమ్మకాయలను వేలం వేస్తారు. మంగళవారం జరిగిన ఈ వేలం పాటలో తొలి నిమ్మకాయను రూ. 27 వేలకు ఓ భక్తుడు కొన్నాడు. 2, 3 నిమ్మకాయలు రూ.6 వేలు, నాలుగోది రూ.5,800, ఐదోది రూ.6,300, ఆరోది రూ. 5 వేలు, 7వది రూ. 5,600, ఎనిమిదోది రూ. 3,700, తొమ్మిదోది రూ. 2,700లకు కొనుగోలు చేశారు. ఈ నిమ్మకాయను దక్కించుకున్న వ్యక్తి భార్య మరుసటి రోజు గింజలతో తిన్నట్లయితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. -
60 ఏళ్లు దాటితే గుండు గీయొద్దు
మదురై: 60 ఏళ్లు దాటిన క్షురకులు తమిళనాడు దిండిగల్ జిల్లా పళనిలోని దండయుతపాణి దేవాలయంలో భక్తులకు గుండు గీయరాదని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. 60 ఏళ్లు పైబడిన వారికి సహజంగా చేతులు వణుకుతుంటాయని తద్వారా భక్తులకు గాయాలయ్యే అవకాశం ఉన్నందున ఆ దేవాలయంలో ఆ క్షురకులు గుండు గీయరాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. 60 ఏళ్ల పైబడిన క్షురకులు సైతం తమ విధులు నిర్వర్తించవచ్చని ఇటీవల ఆలయం ఈవో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రిటైర్డ్ బార్బర్ కె.కుప్పురాజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 65 ఏళ్లు పైబడిన క్షురకులు చేతులు వణుకుతూ భక్తుల చెవులు కోస్తే ఏంటి పరిస్థితి అంటూ జస్టిస్ ఏ సెల్వం, పి కళైయరాజన్ లతో కూడిన బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.