
60 ఏళ్లు దాటితే గుండు గీయొద్దు
మదురై: 60 ఏళ్లు దాటిన క్షురకులు తమిళనాడు దిండిగల్ జిల్లా పళనిలోని దండయుతపాణి దేవాలయంలో భక్తులకు గుండు గీయరాదని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. 60 ఏళ్లు పైబడిన వారికి సహజంగా చేతులు వణుకుతుంటాయని తద్వారా భక్తులకు గాయాలయ్యే అవకాశం ఉన్నందున ఆ దేవాలయంలో ఆ క్షురకులు గుండు గీయరాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
60 ఏళ్ల పైబడిన క్షురకులు సైతం తమ విధులు నిర్వర్తించవచ్చని ఇటీవల ఆలయం ఈవో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రిటైర్డ్ బార్బర్ కె.కుప్పురాజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 65 ఏళ్లు పైబడిన క్షురకులు చేతులు వణుకుతూ భక్తుల చెవులు కోస్తే ఏంటి పరిస్థితి అంటూ జస్టిస్ ఏ సెల్వం, పి కళైయరాజన్ లతో కూడిన బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.