ఆధునిక సాంకేతికత అంతటా యమ వేగంగా అల్లుకుపోతూ ఉంది. ప్రస్తుతం ఆన్‌లైన్ చెల్లింపుల యుగం నడుస్తోంది. అందులో భాగంగా ఫోన్ పే, గుగూల్ పే, పేటీఎం తదితర పద్దతుల్లో ప్రజలు సొమ్ము చెల్లింపు, ఇతర లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు క్యూఆర్ కోడ్‌ను కూడా అనుసరిస్తున్నారు.
ఈ పద్ధతిని ఓ ఆలయ నిర్వాహకులు కూడా అందిపుచ్చుకున్నారు. భక్తులు నగదు అందుబాటులో లేదని సరిపుచ్చుకొని వెళ్లిపోకుండా క్యూ ఆర్ స్కానింగ్ పద్ధతి కూడా అందుబాటులో ఉందని తెలుపుతూ హుండీపై స్టిక్కర్‌ను ఏర్పాటు చేశారు. హుండీలో కానుకగా వేసేందుకు నగదు అందుబాటులో లేని భక్తుల కోసం ఈ క్యూర్ కోడ్‌ను ‘కానుక’గా ఏర్పాటుచేశారు. –కడప కల్చరల్
Comments
Please login to add a commentAdd a comment