ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ | theft on hanuman temple | Sakshi
Sakshi News home page

ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ

Published Fri, Aug 19 2016 1:47 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

theft on hanuman temple

చింతలపూడి: చింతలపూడి పా త బస్టాండ్‌ సెంటర్‌లోని అభయాంజనేయస్వామి ఆలయం లో గురువారం వేకువజామున దొంగలు పడ్డారు. హుండీ తాళాలు పగులగొట్టి నగదు అపహరించారు. ఆలయ అర్చకులు రాఘవాచారి ఉదయం 4 గంటలకు ఆలయానికి రాగా హుండీ తాళాలు పగులగొట్టి ఉండటంతో ఆలయ కమిటీకి సమాచారం అందించారు. దీనిపై పో లీసులకు ఫిర్యాదు చేశామని కమిటీ అధ్యక్షుడు శేషగిరిరావు చెప్పారు. రెండు నెలలుగా హండీ తెరవలేదని సుమారు రూ.15 వేలకు పైగా నగదు ఉండవచ్చని అన్నారు. ఇటీవల కాలంలో చింతలపూడి పరిసర ప్రాంతాల్లో ఆలయాల్లో చోరీలు జోరుగా సాగుతున్నాయి. హుండీ తాళాలు పగులగొట్టి సొమ్ములు అపహరిస్తున్నారు. చింతలపూడిలో ముత్యాలమ్మ, జీబీజీ రోడ్డులో ఆంజనేయస్వామి, యర్రగుంటపల్లి ఆంజనేయస్వామి ఆలయాల్లో ఇదే తరహా చోరీలు జరిగాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement