ఈరన్నకు రూ. 31లక్షల ఆదాయం
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణమాస ఉత్సవాల ముగింపు సందర్భంగా చివరి అమవాస్యకు సంబంధించిన హుండి లెక్కింపును బుధవారం కాలక్షేప మంఠపంలో నిర్వహించారు. పాలక మండలి అధ్యక్షుడు చెన్నబసప్ప, ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన లెక్కింపులో రూ. 31,03,095 నగదు, 9,100 గ్రాముల వెండి, 50 గ్రా. బంగారం సమకూరింది. కార్యక్రమంలో ఆలయ ప్రదాన అర్చకుడు ఈరప్పస్వామి, పర్యవేక్షకులు మల్లికార్జున, వేంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు కొట్రేష్‌గౌడ్, నరసన్న, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.