ఈరన్న హుండీ ఆదాయం రూ. 38.34 లక్షలు
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణమాసపు ఉత్సవాల సందర్భంగా రెండో సోమవారానికి సంబంధించిన హుండీ ఆదాయం రూ. 38,34,892 వచ్చినట్లు ఈఓ మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. హుండీ లెక్కింపును మంగళవారం కాలక్షేప మంఠపంలో నిర్వహించగా నగదుతో పాటు 49గ్రాముల బంగారం, 12కేజీల 50 మిల్లిగ్రాముల వెండి వచ్చినట్లు ఈఓ చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, పర్యవేక్షకులు మల్లికార్జున, వెంకటేశ్వర్లు, ఆలయ, అర్చక సిబ్బంది, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సిబ్బంది, సర్పంచ్ ఆదిలక్ష్మి, ఎంపీటీసీ ముత్తమ్మ, పాలక మండలి డైరెక్టర్లు కొట్రేష్‌గౌడు, ఎలివె ఈరన్న, ఈరన్న, శంక్రమ్మ, తిక్కన్న తదితరులు పాల్గొన్నారు.