
హుండీ ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది
భద్రాచలం :
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. హుండీల ద్వారా 46,71,553 రూపాయలు వచ్చినట్లు దేవస్థానం ఈఓ రమేష్‌బాబు తెలిపారు. 31 గ్రాముల బంగారం, 590 గ్రాముల వెండి వచ్చింది. 713 యూఎస్‌ఏ డాలర్లు, 108 సౌదీ రియాల్స్, 3 క్వార్టర్, 10 మలేషియా, 5 యూనా, 1 మానట్ , 1 దినా డాలర్‌లు వచ్చినట్లుగా వివరించారు. 30 రోజులుకు గాను హుండీల ద్వారా ఈ ఆదాయం లభించిందన్నారు.