ఓ మూలన పడేసిన హుండీ
మహానంది దేవస్థానంలోని నిత్యాన్నదాన భవనంలోని హుండీ చోరీ యత్నం సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది.
– అన్నదానభవనంలో ఘటన
మహానంది: మహానంది దేవస్థానంలోని నిత్యాన్నదాన భవనంలోని హుండీ చోరీ యత్నం సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించడంతో సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాల్లోకి వెళితే...మహానంది దేవస్థానంలో ప్రతిరోజు 125 మంది భక్తులకు అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయ పరిసరాల్లోని అన్నదాన భవనంలో హుండీ ఉంటుంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు అన్నదానమండపం వెనుక వైపు ఉన్న కిటికీలకు ఉన్న కడ్డీలను తొలగించి లోపలికి చొరబడ్డారు. అక్కడే ఉన్న హుండీని భవనం వెనుక ఉన్న షెడ్డువైపు తీసుకొచ్చి చోరీకి యత్నించారు. హుండీ తాళం పగలగొట్టలేక పడేసి వెళ్లారు. ఆదివారం ఉదయం గుర్తించిన సిబ్బంది అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రెండు వర్గాల మధ్య ఉన్న విభేధాలే ఈ ఘటనలకు కారణం ఉండొచ్చు అని పలువురు చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్నదానమండపం ప్రాంగణంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.