శ్రీవారి హుండీలో చోరీ | theft in srivari hundi | Sakshi
Sakshi News home page

శ్రీవారి హుండీలో చోరీ

Published Wed, Jul 27 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

నిందితుడు అర్జున్‌తో క్రై ం ఎస్‌ఐ రామయ్య

నిందితుడు అర్జున్‌తో క్రై ం ఎస్‌ఐ రామయ్య

 
– రూ.50,500 కానుకలు స్వాధీనం
–  నిందితుడి అరెస్ట్‌
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి హుండీలో చోరీకి పాల్పడిన తూర్పుగోదావరి జిల్లా ఆలమూరుకు చెందిన పి.అర్జున్‌(30) పట్టుబడ్డాడు. మంగళవారం రాత్రి 8గంటల సమయంలో ఆలయ హుండీలో కానుకలు వేస్తున్నట్టు నటించాడు. అదే సమయంలో ఇతర భక్తులు వేసిన కానుకల్ని చే త్తో పట్టుకున్నాడు. ఈ దృశ్యాలను అక్కడి భద్రతా సిబ్బంది సీసీ కెమెరాల్లో గుర్తించారు. వెంటనే నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుండి రూ.50,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అర్జున్‌తోపాటు నగదును క్రై ం పోలీసులకు అప్పగించారు.  టీటీడీ విజిలెన్స్‌ విభాగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని క్రై ం ఎస్‌ఐ రామయ్య తెలిపారు. నిందితుడు మూడేళ్ల ముందు హుండీలో చోరీ చేస్తూ పట్టుబడిన పాతనేరస్తుడని తెలిపారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement