భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉభయ ఆలయాల్లోని హుండీల ద్వారా రూ.1,40,80,480లు వచ్చినట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు.
మల్లన్న హుండీ ఆదాయం రూ. 1.40 కోట్లు
Feb 15 2017 12:26 AM | Updated on Oct 8 2018 9:10 PM
శ్రీశైలం : భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉభయ ఆలయాల్లోని హుండీల ద్వారా రూ.1,40,80,480లు వచ్చినట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. మంగళవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అధికారులు, సిబ్బంది, వ్యాపారస్తులు, భక్తులు హుండీల ఆదాయాన్ని(24 రోజులు) లెక్కించారు. నగదుతోపాటు 304.5 గ్రాముల బంగారం, 3.950 కేజీల వెండి వచ్చినట్లు ఈఓ తెలిపారు. అలాగే 345 యూఎస్‌ఎ డాలర్లు, 50 ఇంగ్లాండ్ ఫౌండ్లు, 5 కెనడా డాలర్లు, 5 యూఏఈ దిర్హమ్స్, 219 మలేషియా రింగిట్స్, 4 సింగపూర్ డాలర్లు లభించాయన్నారు.
Advertisement
Advertisement