మహానందీశ్వరుని హుండీ లెక్కింపు | mahanandiswar's hundi counting | Sakshi
Sakshi News home page

మహానందీశ్వరుని హుండీ లెక్కింపు

Published Sat, Sep 24 2016 1:56 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

మహానంది క్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన హుండీల లెక్కింపు ద్వారా రూ. 25.63 లక్షలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్‌ శంకర వరప్రసాద్‌ తెలిపారు.

మహానంది: మహానంది క్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన హుండీల లెక్కింపు ద్వారా రూ. 25.63 లక్షలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్‌ శంకర వరప్రసాద్‌ తెలిపారు. మహానంది క్షేత్రంలోని సామూహిక అభిషేక మండపంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కామేశ్వరీదేవి సహీత మహానందీశ్వరస్వామి, కోదండరామాలయం, వినాయకనంది ఆలయాల్లో ఉన్న హుండీల లెక్కింపు ద్వారా రూ. 25,53,695 వచ్చిందన్నారు. అలాగే అన్నదానం విభాగం ద్వారా రూ. 9,453 వచ్చినట్లు చెప్పారు. రెండు కలిపి రూ. 25,63,148 వచ్చినట్లు తెలిపారు. ఈ ఆదాయం 52 రోజులకు వచ్చిందన్నారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఏఈఓ రాజశేఖర్, ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, పాలకమండలి ధర్మకర్తలు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement