![Officers Take Out Cat In Ramalayam Hundi - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/12/Cat.jpg.webp?itok=DKybpqzX)
తల్లివద్దకు చేరిన పిల్లి పిల్ల
మహానంది: ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్న చందంగా ..ఓ పిల్లి కూన మహానందిలోని రామాలయం హుండీలోకి దూరింది. అందులో నుంచి బయటికి రాలేకపోయింది. శుక్రవారం ఉదయం విధులకు వచ్చిన అర్చకులు గుర్తించి విషయాన్ని ఈఓ మల్లికార్జున ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. దేవదాయశాఖ నిబంధనల ప్రకారం హుండీల తాళాలు ఒకసెట్ దేవస్థానం వారి వద్ద, మరో సెట్ కర్నూలులోని ఏసీ కార్యాలయంలో ఉంటాయి. దీంతో ఈఓ విషయాన్ని ఏసీ దృష్టికి తీసుకెళ్లడంతో దేవదాయశాఖ నంద్యాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి కర్నూలుకు వెళ్లి తాళాలు తీసుకొచ్చారు. అనంతరం ఈఓ సమక్షంలో సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో హుండీ తాళాలు తెరచి పిల్లిపిల్లను బయటికి తీశారు. బయటికి వచ్చి వెంటనే అది తల్లి వద్దకు పరుగుపెట్టుకుంటూ వెళ్లింది.
చదవండి: మాయమాటలతో బాలికను లొంగదీసుకుని..
విషాదం: కన్నీరే మిగిలిందిక నేస్తం!
Comments
Please login to add a commentAdd a comment