మల్లన్న హుండీ ఆదాయం రూ. 1.91 కోట్లు
Published Sat, May 27 2017 12:12 AM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉభయ దేవాలయాల్లో భక్తులు హుండీలలో వేసిన కానుకలను లెక్కించగా రూ. 1, 91, 45, 584 వచ్చినట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్త తెలిపారు. శుక్రవారం స్వామిఅమ్మవార్ల కల్యాణ మండపంలో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, భక్తులు, స్థానికులు ఈ లెక్కింపులో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. నగదుతో పాటు 185 ›గ్రాముల బంగారు, 5.800 కిలో గ్రాముల వెండి, 43 యూఎస్‌ఏ డాలర్లు, 5 ఇంగ్లండ్ ఫౌండ్స్, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 20 న్యూజిలాండ్ డాలర్లు, 10 ఎఎస్‌యూ రియాల్స్, 1 మలేషియా రింగిట్స్, 1/4 కువైట్ డాలర్ తదితర విదేశీ కరెన్సీ హుండీలలో లభించాయన్నారు.ఈ మొత్తం 30 రోజులకు గాను స్వామిఅమ్మవార్లకు వచ్చిన ఆదాయంగా ఈఓ పేర్కొన్నారు.
Advertisement
Advertisement