మల్లన్న హుండీ ఆదాయం రూ. 1.28 కోట్లు
శ్రీశైలం : శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఉభయ ఆలయాల్లోని హుండీల ద్వారా రూ.1,28,53,611 ఆదాయం వచ్చినట్లు ఈఓ నారాయణభరత్‌గుప్త తెలిపారు. బుధవారం అక్కమహాదేవి అలంకార మండపంలో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, స్థానికులు, భక్తులు హుండీల ఆదాయాన్ని లెక్కించారు. నగదుతో పాటు 135 గ్రాముల బంగారు, 4.4 కేజీల వెండి లభించినట్లు ఈఓ తెలిపారు. అలాగే 66 అమెరికా డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 10 న్యూజిలాండ్ డాలర్లు, 180 యూఎఈ దిర్హమ్స్ హుండీలలో వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం 22 రోజులకు సంబంధించినదని ఈఓ తెలిపారు.