మల్లన్న హుండీ ఆదాయం రూ.1.29 కోట్లు
మల్లన్న హుండీ ఆదాయం రూ.1.29 కోట్లు
Published Sat, Dec 10 2016 9:13 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉభయదేవాలయాల్లోని 15 రోజుల హుండీ ఆదాయం రూ.1,29,41,864 వచ్చినట్లు ఈఓ నారాయణభరత్ గుప్త తెలిపారు. శనివారం అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన ఈ లెక్కింపులో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నగదుతో పాటు 36.650 గ్రాముల బంగారు, 2.150 కిలో గ్రాముల వెండి వచ్చిందన్నారు. గత నెల 25 నుంచి శనివారం వరకు వచ్చిన ఆదాయంగా ఈఓ పేర్కొన్నారు.
Advertisement
Advertisement