నేడు మల్లన్న హుండీల లెక్కింపు
Published Sun, Jul 24 2016 11:42 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
శ్రీశైలం : శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఉభయదేవాలయాలలోని హుండీలెక్కింపును సోమవారం స్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త ఆదివారం తెలిపారు. హుండీ లెక్కింపులో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అంతా చొక్క, బనియన్లు తీసీవేసి హాజరు కావాలన్నారు. అలాగే నగదు, ఉంగరాలు ధరించకుండా హుండీల లెక్కింపులో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. హుండీ లెక్కింపు ప్రారంభమైన తరువాత అత్యవసరంగా ఎవరైనా సిబ్బంది బయటకు వెళ్లినా, లోపలికి వచ్చినప్పుడు వారి రాకపోకల వివరాలను తెలియజేసేందుకు రిజిస్టర్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, ఎవరైనా అధికార సిబ్బంది హుండీల లెక్కింపులో పాల్గొనని వారిపై క్రమశిక్షణ చర్యలు, జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
Advertisement
Advertisement