
ఒంటిమిట్ట ఆలయ హుండీ లెక్కింపు
కడప కల్చరల్ :
ఒంటమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోని హుండీని సోమవారం లెక్కించారు. తిరుమల–తిరుపతి దేవస్థానాల అసిస్టెంట్ ఇంజనీరు శంకర్‌రాజు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల రోజులకుగాను హుండీలో రూ. 3,11,675 సమకూరిందని ఏఈ శంకర్‌రాజు తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ సిబ్బంది, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.