పొలాల్లో ఉన్న హుండీని పరిశీలిస్తున్న పోలీసులు
నంద్యాల: మండలపరిధిలో ఒకేరోజు మూడు ఆలయాల్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. సోమవారం రాత్రి బొమ్మలసత్రం ప్రాంతంలోని సాయిబాబా ఆలయం తాళాలను పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. అందులోని రూ.50వేలను తీసుకుని ఆలయానికి కొద్దిదూరంలో ఖాళీ హుండీని పడేసి వెళ్లారు. అక్కడి నుంచి దొంగల గ్యాంగ్ చాపిరేవుల సమీపంలో ఉన్న కాసిరెడ్డినాయన ఆశ్రమంలో చోరీకి పాల్పడ్డారు. తర్వాత కొద్దిదూరంలోని పెద్దమ్మ గుడిలో చొరబడి హుండీని ఎత్తుకెళ్లడానికి యత్నించారు. అయితే, స్థానికులు గమనించడంతో పరారయ్యారు. ఈ సీరియల్ దొంగతనాలు భక్తులను కలవరపెడుతున్నాయి. ఎస్‌ఐ సూర్యమౌళి చోరీ జరిగిన సాయిబాబా ఆలయాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.