మల్లన్న హుండీ ఆదాయం రూ.73.44 లక్షలు
మల్లన్న హుండీ ఆదాయం రూ.73.44 లక్షలు
Published Tue, Aug 9 2016 10:30 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జుర స్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు మంగళవారం లెక్కించగా రూ.73,44,451 వచ్చినట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్త తెలిపారు. అక్కమహాదేవి అలంకార మండపంలో అధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. నగదుతో పాటు 107 యూఎస్‌ఏ డాలర్లు, 50 న్యూజిలాండ్ డాలర్లు, 40 యూకే పౌండ్లు, ఐదు మాల్దీవి విదేశీ కరెన్సీ లభించిందన్నారు. ఈ మొత్తం 15 రోజుల్లో స్వామి అమ్మవార్లకు వచ్చిన ఆదాయమని వెల్లడించారు.
Advertisement
Advertisement