సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామిని జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం కుటుంబసమేతంగా స్వామి వారికి పట్నం వేసిన అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలావుంటే మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో వారాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. పలువురు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
చదవండి: వివేక్ ఒబెరాయ్‌పై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment