విష్ణు మంచు హీరోగా నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ . మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటివారు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
కాగా ‘కన్నప్ప’ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించినట్లు వెల్లడించి, ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు భక్తికి మాత్రం దాసుడు’ అని ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై ఉంది. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment