‘కాంచన 2’ రీమేక్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో | Akshay Kumar to star in Hindi remake of Kanchana 2 | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 30 2018 11:47 AM | Last Updated on Tue, Jan 30 2018 11:47 AM

Kanchana 2 Poster - Sakshi

గంగ(కాంచన 2) సినిమాలో రాఘవ లారెన్స్‌

సౌత్‌లో హర్రర్‌ సినిమాలకు క్రేజ్‌ తీసుకువచ్చిన నటుడు రాఘవ లారెన్స్‌. ముని, కాంచన, గంగ (కాంచన 2) సినిమాలతో వరస విజయాలు సాధించిన లారెన్స్‌.. ప్రస్తుతం కాంచన 3 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. లారెన్స్‌ సరసన తాప్సీ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ‘గంగ(కాంచన 2)’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. ఈ రీమేక్‌ లో లారెన్స్‌ పాత్రలో బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్ నటించనున్నాడు.

క్రిఅర్జ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ప్రేరణా అరోరా, అర్జున్‌ ఎన్‌ కపూర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్యాడ్ మ్యాన్‌ రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్న అక్షయ్‌, 2.ఓ, కేసరి, గోల్డ్‌ సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తరువాత గంగ(కాంచన 2) రీమేక్‌ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను 2019లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement