నాకేం తక్కువ! | Nitya meanon worry about her Operatuninitis | Sakshi
Sakshi News home page

నాకేం తక్కువ!

Published Mon, Jan 30 2017 1:58 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

నాకేం తక్కువ!

నాకేం తక్కువ!

పొగరుబోతుగా పేరు తెచ్చుకున్న నటి నిత్యామీనన్  కు ఇప్పుడు చాలా బెంగ పట్టుకుందట. ఇంతకు ముందు అవకాశాలు లేకపోయినా పర్వాలేదు హాయిగా ఇంట్లో కూర్చుంటాను కానీ అందుకోసం ఎవరినీ అడగను అని బింకాలు తీసిన ఈ అమ్మడు ఇప్పుడు ఆ అవకాశాలు రాకపోవడంతో చాలా ఇదైపోతోందట. మార్కెట్‌ ఉన్నప్పుడు మాటలు వేరు, అది లేనప్పుడు మాటలు వేరని నిత్యామీనన్ ను చూస్తే అర్థం అవుతుంది కదూ. ఈ కేరళ కుట్టికి అవకాశాలు అడపాదడపా వస్తున్నా అవి రెండవ హీరోయిన్  పాత్రలే కావడంతో ఇందుకు కారణం ఏమిటని తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధ పడిపోతోందట. తనకు అందం తక్కువా? అభినయ ప్రతిభ లేదా? అంటూ వాపోతోందట.

నిజం చెప్పాలంటే మణిరత్నం చిత్రం ఓ కాదల్‌ కణ్మణి తరువాత నిత్యామీనన్  సోలో నాయకిగా నటించిన చిత్రాలు లేవనే చెప్పాలి. చాలా మందికి చెప్పినట్లే తన గోడును కాంచన–2 చిత్రంలో వైవిధ్యభరిత పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించిన లారెన్స్  వద్ద చెప్పుకుందట. అందుకు ఆయన అన్న మాట ఇంత బొద్దుగా ఉంటే ఎవరు మాత్రం కథానాయకి అవకాశాలు ఇస్తారు? ముందు బరువు తగ్గే ప్రయత్నం చేయండి అని చెప్పారట. కథానాయికలకు శారీరక అందం చాలా ముఖ్యం అని, సన్నగా, నాజూగ్గా ఉంటేనే అవకాశాలు వస్తాయని అన్నారట. అంతే కాదు స్లిమ్‌గా, గ్లామరస్‌గా ఎలా తయారవ్వాల్లో హిందీ నటి అనుష్కాశర్మను అడిగి తెలుసుకోండి అని ఉచిత సలహా కూడా ఇచ్చారట. దీంతో అమ్మడు ఇప్పుడు బరువు తగ్గి అందాన్ని పెంచుకునే పనిలో పడ్డారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement