ఇక్కడ రామ్‌చరణ్‌... అక్కడ లారెన్స్‌! | lawrance next movie name kala bhairava | Sakshi
Sakshi News home page

ఇక్కడ రామ్‌చరణ్‌... అక్కడ లారెన్స్‌!

Published Sun, Jan 21 2018 3:49 AM | Last Updated on Sun, Jan 21 2018 3:49 AM

lawrance next movie name kala bhairava - Sakshi

కాలభైరవ అంటే తెలుగులో అయితే వెంటనే హీరో రామ్‌చరణ్‌ గుర్తొస్తారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ సినిమా సెకండాఫ్‌లో రామ్‌చరణ్‌ క్యారెక్టర్‌ నేమ్‌ అదే. తమిళంలో మాత్రం  కాలభైరవ అంటే ఇకపై రాఘవ లారెన్స్‌ గుర్తొస్తారేమో. ఎందుకంటే ఆయన నెక్ట్స్‌ చిత్రం టైటిల్‌ అదే. ‘‘మై డియర్‌ ఫ్యాన్స్‌ అండ్‌ ఫ్రెండ్స్‌. నా నెక్ట్స్‌ సినిమా టైటిల్‌ ‘కాల భైరవ’. ప్రస్తుతం ‘కాంచన 3’ షూటింగ్‌ జరుగుతోంది.

ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ‘కాలభైరవ’ షూటింగ్‌ మొదలుపెట్టాలనుకుంటున్నాం. బహుశా ఏప్రిల్‌లో స్టార్ట్‌ చేసే అవకాశం ఉంది. మరో రెండు సినిమాల గురించి డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. అన్నీ కుదరితే మార్చిలోపు ఆ సినిమాల వివరాలు కూడా చెబుతాను’’ అని పేర్కొన్నారు లారెన్స్‌. ప్రస్తుతం లారెన్స్, ఓవియా, వేదిక నటిస్తున్న ‘కాంచన 3’ షూటింగ్‌ చెన్నైలో జరుగుతోంది. ఈ సినిమాలోని లేటెస్ట్‌ స్టిల్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మీరు చూస్తొన్న ఫోటో అదే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement