ఆ చిత్రాల్లో అందాలారబోసి రెచ్చిపోయా! | Nikkigalrani about exposing | Sakshi
Sakshi News home page

ఆ చిత్రాల్లో అందాలారబోసి రెచ్చిపోయా!

Published Sat, Nov 12 2016 2:38 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

ఆ చిత్రాల్లో అందాలారబోసి రెచ్చిపోయా!

ఆ చిత్రాల్లో అందాలారబోసి రెచ్చిపోయా!

ఆ చిత్రాల్లో గ్లామర్‌తో రెచ్చిపోయి నటించాను. అభిమానులకు అందాలమోతేనటోంది నటి నిక్కీగల్రాణి. డార్లింగ్ చిత్రంలో కథానాయకుడిని ప్రేమించే యువతిగానూ, దెయ్యంగానూ రెండు కోణాల్లో తనదైన నటనను ప్రదర్శించి కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ఆ తరువాత యాగవరాయనుం నాకాక్క, కో 2, వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్ తదితర చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో ఐదారు చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు.

నిక్కీగల్రాణి లారె న్‌‌సతో నటించిన మొట్టశివ కెట్టశివ, విక్రమ్‌ప్రభుతో జత కట్టిన నెరుప్పుడా, జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో రొమా న్‌‌స చేసిన కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ మూడు చిత్రాలూ తనకు చాలా స్పెషల్ అం టోందీ బ్యూటీ. దీని గురించి నిక్కీగల్రాణి తెలుపుతూ స హజంగా తాను చాలా చలాకీ అమ్మాయినని చెప్పుకొచ్చింది. ఎప్పుడూ ఏదో ఇక పనిచేస్తూనే ఉం టానని, అదీకాకపోతే ఎవరైనా కనిపిస్తే వా రితో గలగలా మాట్లాడడం తన స్వభావం అని చెప్పిం ది.

ఇక తాను నటిస్తున్న పై మూడు చిత్రాల్లోనూ తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలేనని తెలిపింది. దీంతో కథను కూడా సహజసిద్ధంగా నటించేశానని చెప్పింది. ఇవి తాను ఇంతకు ముందు నటించిన చిత్రాల్లోని పాత్రలకు చాలా భిన్నంగా ఉంటాయని, అభినయంతో పాటు అందాలారబోతలోనూ ఇరగదీశానని చెప్పుకొచ్చింది.అంతేకాదు ఈ చిత్రాలు తెరపైకి వచ్చిన తరువాత తాను తన అభిమానులకు మరింత నచ్చేస్తానని అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement