Co 2
-
బిల్‌గేట్స్, బెజోస్పై విమర్శలు: ‘మాకు నీతులు చెప్పి.. మీరేమో ఇలా’
వాషింగ్టన్: సామాన్యులు అంటే పర్లేదు కానీ.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తమ నోటి వెంట వచ్చే మాటకు కట్టుబడి ఉండాలి. చేసేవాటినే చెప్పాలి.. చెప్పిన వాటిని ఆచరించాలి. అలా కాదని ప్రజలకు నీతి వ్యాఖ్యలు బోధించి.. వారు మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. జనాలు కూడా ఊరుకోరు. ఎడాపెడా చీవాట్లు పెడతారు. తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ప్రపంచ కుబేరులు బిల్‌గేట్స్, జెఫ్ బెజోస్. వీరిద్దరిపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు నెటిజనులు. ఈ కుబేరులు ఇంతలా విమర్శలపాలు కావడానికి కారణం ఏంటో తెలియాలంటే ఇది చదవండి. కొద్ది రోజుల క్రితమే బిల్‌గేట్స్ తన 66వ పుట్టినరోజు వేడులకు ఘనంగా జరుపుకున్నారు. కేవలం 50 మంది మాత్రమే ఈ బర్త్‌డే పార్టీకి హాజరయ్యారు. వేడుకలు టర్కీ సముద్ర తీరంలో.. ఓ లగ్జరీ పడవలో నిర్వహించారు. ఈ పార్టీకి హాజరుకావడం కోసం బెజోస్ హెలికాప్టర్లో 120 మైళ్ల దూరం ప్రయాణించి.. అక్కడకు చేరుకున్నాడు. ఈ బర్త్‌డే వేడుకల సందర్భంగా వెల్లడైన కార్బన్‌డైయాక్సైడ్ మోతాదుపై తాజాగా విపరీతమైన చర్చ నడుస్తోంది. కేవలం నాలుగు గంటల పాటు సాగిన బర్త్‌డే పార్టీ జరిగిన పడవ నుంచి 19 టన్నులు, బెజోస్ హెలికాప్టర్ ప్రయాణంలో 215 పౌండ్ల కార్బన్ డయాక్సైడ్ వెల్లడయినట్లు తెలిసింది. (చదవండి: ఆయన గెలుపు కంటే.. ఈయన వెటకారమే ఎక్కువైంది) ఈ క్రమంలో పలువురు నెటిజనులు బిల్‌గేట్స్, బెజోస్పై విమర్శలు కురిపిస్తున్నారు. ఓ వైపు ఈ ఇద్దరు మానవతావాదులు పర్యావరణ పరిరక్షణ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. మరోవైపు వీరి ఆడంబరాలు.. మరింత కార్బన్ ఉద్గారాలను వెల్లడిస్తుంటాయి. జనాలకేమో ఆఫీసుకు వెళ్లడానికి వ్యక్తిగత వాహనాల బదులు.. ప్రజా రవాణ వ్యవస్థను వినియోగించుకొండి అని నీతులు చెబుతూ.. మీరు మాత్రం మీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయండి అని విమర్శిస్తున్నారు. (చదవండి: బిల్‌గేట్స్‌నే బకరా చేసిన బిల్డప్ బాబాయ్) బిల్‌గేట్స్ బర్త్‌డే పార్టీ జరిగిన పడవ సూపర్యాచ్ని లానా అని పిలుస్తారు. ప్రముఖ వ్యాపార దినపత్రిక ప్రకారం, గేట్స్ వారానికి 1.8 మిలియన్ పౌండ్లకు దీనిని అద్దెకు తీసుకున్నారు. గేట్స్ అతిథులు మెగా-యాచ్ నుంచి సీ మీ బీచ్ అని పిలువబడే ఫెతియే నగరంలోని ఏకాంత బీచ్‌కి వెళ్లినట్లు తెలిసింది. చదవండి: ఇద్దరూ ఇద్దరే.. వీళ్ల చర్యలు ఊహాతీతం -
సీఓ2 ఎఫెక్ట్.. సముద్రమట్టాలు పైపైకి
సాక్షి, హైదరాబాద్: వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ మోతాదు అంతకంతకూ పెరిగిపోతున్న కారణంగా గత దశాబ్ద కాలంలో సముద్ర మట్టాలు ఏడాదికి సగటున 4.8 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయని అంతర్జాతీయ శాస్త్ర వేత్త డాక్టర్ అనీ కాజనేవ్ తెలిపారు. ఈ పెరుగుదల గత రెండు దశాబ్దాల కంటే ఎక్కువగా ఉందని, పైగా సముద్రమట్టాల పెరుగుదల రేటు కూడా పెరిగిందన్నారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అనుబంధ సంస్థ జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) 60వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ఆన్లైన్ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ శేఖర్ సి మాండే, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ వి.ఎం.తివారీ పాల్గొన్నారు. సూర్యుడి నుంచి భూమిని చేరుతున్న శక్తి ఎక్కువగా ఉండటం, సూర్యరశ్మి రూపంలో మళ్లీ అంతరిక్షంలోకి మళ్లే శక్తి తక్కువ కావడం వల్ల భూతాపోన్నతి పెరుగుతున్న విషయం తెలిసిందే. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం, పచ్చదనం తగ్గిపోవడం వంటి కారణాలు భూతాపోన్నతి వేగాన్ని పెంచుతున్నాయని, 2010–2020 మధ్యకాలంలో వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ మోతాదు రికార్డు స్థాయికి చేరడం గమనార్హమని డాక్టర్ అనీ కాజనేవ్ తెలిపారు. కరోనా కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఈ ఏడాది మార్చిలో కార్బన్ డైయాక్సైడ్ మోతాదు తగ్గినప్పటికీ ఆ తరువాత షరా మామూలుగా మారిపోయిందన్నారు. భూమి సగటు ఉష్ణోగ్రతలు 1850–2019 మధ్యకాలంలో ఒక డిగ్రీ సెల్సియస్ వరకు పెరగ్గా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయని ఆమె వివరించారు. హిమనీనదాలు వేగంగా కరిగిపోతుండటం వల్ల సముద్ర మట్టాల పెరుగుదలలో వేగం ఎక్కువైందని చెప్పారు. 1900–1990 మధ్యకాలంలో ఇది 15 సెంటీమీటర్లుగా ఉందని, ఆ తరువాత కాలంలో ఉపగ్రహాల సాయంతో సముద్రమట్టాలపై జరిపిన పరిశీలన కూడా ఇదే తీరులో కొనసాగుతోందన్నారు. -
ఆ చిత్రాల్లో అందాలారబోసి రెచ్చిపోయా!
ఆ చిత్రాల్లో గ్లామర్‌తో రెచ్చిపోయి నటించాను. అభిమానులకు అందాలమోతేనటోంది నటి నిక్కీగల్రాణి. డార్లింగ్ చిత్రంలో కథానాయకుడిని ప్రేమించే యువతిగానూ, దెయ్యంగానూ రెండు కోణాల్లో తనదైన నటనను ప్రదర్శించి కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ఆ తరువాత యాగవరాయనుం నాకాక్క, కో 2, వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్ తదితర చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో ఐదారు చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. నిక్కీగల్రాణి లారె న్‌సతో నటించిన మొట్టశివ కెట్టశివ, విక్రమ్‌ప్రభుతో జత కట్టిన నెరుప్పుడా, జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో రొమా న్స చేసిన కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ మూడు చిత్రాలూ తనకు చాలా స్పెషల్ అం టోందీ బ్యూటీ. దీని గురించి నిక్కీగల్రాణి తెలుపుతూ స హజంగా తాను చాలా చలాకీ అమ్మాయినని చెప్పుకొచ్చింది. ఎప్పుడూ ఏదో ఇక పనిచేస్తూనే ఉం టానని, అదీకాకపోతే ఎవరైనా కనిపిస్తే వా రితో గలగలా మాట్లాడడం తన స్వభావం అని చెప్పిం ది. ఇక తాను నటిస్తున్న పై మూడు చిత్రాల్లోనూ తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలేనని తెలిపింది. దీంతో కథను కూడా సహజసిద్ధంగా నటించేశానని చెప్పింది. ఇవి తాను ఇంతకు ముందు నటించిన చిత్రాల్లోని పాత్రలకు చాలా భిన్నంగా ఉంటాయని, అభినయంతో పాటు అందాలారబోతలోనూ ఇరగదీశానని చెప్పుకొచ్చింది.అంతేకాదు ఈ చిత్రాలు తెరపైకి వచ్చిన తరువాత తాను తన అభిమానులకు మరింత నచ్చేస్తానని అంటోంది.