తిరుపతిలో ప్రభుదేవా, నిక్కీగల్రాణిల పెళ్లి జరగనుందట. ఏమిటీ నమ్మశక్యంగా లేదా ? ప్రభుదేవా, నయనతారల ప్రేమ పెళ్లి వరకూ ఆగిపోయిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివతో ప్రేమలో పడి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనే ప్రచారం కూడా చాలా కాలంగానే జరుగుతోంది. అయితే ప్రభుదేవా మాత్రం ఒంటరిగానే జీవిస్తున్నారు. తాజాగా నిక్కీగల్రాణితో పెళ్లికి సిద్ధం అయ్యారనే ప్రచారం జోరందుకుంది.
తిరుపతిలో బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇది రియల్ పెళ్లి కాదండోయ్. రీల్ పెళ్లి తతంగం. ఇదన్నా సవ్యంగా జరుగుతుందా? ఏమో చెప్పలేం ఎందుకంటే ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఆదాశర్మ కూడా నటిస్తోంది. ఇంతకు ముందు ప్రభు, ప్రభుదేవా కలిసి నటించిన చార్లీచాప్లిన్‌కు స్వీకెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిక్కీగల్రాణి, ఆదాశర్మ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అమ్మా క్రియేషన్స్ టి. శివ నిస్తున్న ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకుడు.
ఈయన చిత్రాలంటే హాస్యంతో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయి. చార్లీచాప్లిన్-2 గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ప్రభుదేవా, నిక్కీగల్రాణి పెళ్లి కోసం ఇద్దరి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లేటప్పుడు, ఆ తర్వాత జరిగే సంఘటనలే చార్లీచాప్లిన్-2 చిత్రం అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం అమ్నేశ్, ఛాయాగ్రహణను సౌందర్‌రాజన్‌లు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment