తుది దశలో చార్లీచాప్లిన్‌–2 | Costly sets for Charlie Chaplin 2 stunts | Sakshi
Sakshi News home page

తుది దశలో చార్లీచాప్లిన్‌–2

Published Sat, Feb 17 2018 5:13 AM | Last Updated on Sat, Feb 17 2018 5:13 AM

Costly sets for Charlie Chaplin 2 stunts - Sakshi

చార్లీచాప్లిన్‌–2 చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: ఇంతకుముందు ప్రభు, ప్రభుదేవా కలిసి నటించిన పూర్తి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్‌ చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో తాజాగా ఆ చిత్ర దర్శకుడు శక్తి చిదంబరంనే దానికి సీక్వెల్‌గా చార్లీచాప్లిన్‌–2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్వకత్వంలో పార్టీ అనే కలర్‌ఫుల్‌ చిత్రాన్ని నిర్మిస్తున్న అమ్మా క్రియేషన్స్‌ శివనే ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోనూ ప్రభుదేవా, ప్రభు కలిసి నటిస్తుండడం విశేషం. ఇక హీరోయిన్లుగా గ్లామర్‌ డాల్స్‌ నిక్కీగల్రాణి, బాలీవుడ్‌ భామ ఆదాశర్మ నటిస్తున్నారు.

ఆదాశర్మకు ఇదే తోలి తమిళ చిత్రం అవుతుంది. ఇతర ముఖ్య పాత్రల్లో రవిమరియ, సెంథిల్, ఆకాశ్, వివేక్‌ ప్రసన్న,శామ్స్, శాంత, కావ్య, మగధీర చిత్ర ఫేమ్‌ దేవ్‌సింగ్, ముంబై విలన్‌ సమీర్‌ కోచ్, కోవమల్‌శర్మ, అమీత్, నట్పుకాగ వైభన్‌ నటిస్తున్నారు. అమ్రేశ్‌ సంగీతాన్ని, సౌందర్‌రాజన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీనికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను అందిస్తున్న శక్తిచిదంబరం చిత్ర వివరాలను తెలుపుతూ చార్లీచాప్లిన్‌–2 పూర్తిగా కమర్శియల్‌ కామెడీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం తుది ఘట్ట చిత్రీకరణ జరుపుకుంటోందదని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement