ప్రేమలో పడ్డారా? | adah sharma, vidyut jamwal with affairs | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడ్డారా?

Published Fri, Oct 5 2018 1:17 AM | Last Updated on Fri, Oct 5 2018 1:17 AM

adah sharma, vidyut jamwal with affairs - Sakshi

అదా శర్మ

‘కమాండో 3’ సినిమా సెట్‌లో డాక్టర్‌ అవతారం ఎత్తారు హీరో విద్యుత్‌ జమాల్‌. అదేంటీ... కమాండో సిరీస్‌లో యాక్షన్‌ హీరోగా చేస్తున్న జమాల్‌ సడన్‌గా డాక్టర్‌ పాత్ర చేయడం ఏంటీ? అని కన్‌ఫ్యూజ్‌ కావొద్దు. ఆయన డాక్టర్‌గా మారింది ‘హార్ట్‌ ఎటాక్‌’ మూవీ హీరోయిన్‌ అదా శర్మ కోసం. ఇటీవల ‘కమాండో 3’ సినిమా సెట్‌లో అదా శర్మ గాయపడ్డ విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు షూటింగ్‌లో పాల్గొంటున్నారనుకోండి. కానీ ఆమెకు గాయం అయితే తనకు గాయం అయినట్లుగా  విద్యుత్‌ విలవిలలాడిపోయారట.

ఓ డాక్టర్‌లా జాగ్రత్తలు చెప్పారట. అంతేనా? సెట్‌లో కెమెరా కోసమే కాదు.. కెమెరా వెనక కూడా చాలా క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నారని బాలీవుడ్‌ టాక్‌. కో–స్టార్స్‌ అంటే ఆ మాత్రం క్లోజ్‌నెస్‌ ఉండటంలో తప్పు లేదు. కానీ అంతకుమించి వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని, అది ప్రేమేనని అంటున్నారు బాలీవుడ్‌ ఔత్సాహికరాయుళ్లు. మరి.. విద్యుత్, అదా మధ్యలో నిజంగా ప్రేమ చిగురించిందా? అనే విషయంలో స్పష్టత రావాలంటే మరికొంత సమయం వేచి ఉండక తప్పదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement