Adasharma
-
ప్రేమలో పడ్డారా?
‘కమాండో 3’ సినిమా సెట్లో డాక్టర్ అవతారం ఎత్తారు హీరో విద్యుత్ జమాల్. అదేంటీ... కమాండో సిరీస్‌లో యాక్షన్ హీరోగా చేస్తున్న జమాల్ సడన్‌గా డాక్టర్ పాత్ర చేయడం ఏంటీ? అని కన్ఫ్యూజ్ కావొద్దు. ఆయన డాక్టర్‌గా మారింది ‘హార్ట్ ఎటాక్’ మూవీ హీరోయిన్ అదా శర్మ కోసం. ఇటీవల ‘కమాండో 3’ సినిమా సెట్లో అదా శర్మ గాయపడ్డ విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు షూటింగ్లో పాల్గొంటున్నారనుకోండి. కానీ ఆమెకు గాయం అయితే తనకు గాయం అయినట్లుగా విద్యుత్ విలవిలలాడిపోయారట. ఓ డాక్టర్లా జాగ్రత్తలు చెప్పారట. అంతేనా? సెట్లో కెమెరా కోసమే కాదు.. కెమెరా వెనక కూడా చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారని బాలీవుడ్ టాక్. కో–స్టార్స్ అంటే ఆ మాత్రం క్లోజ్‌నెస్ ఉండటంలో తప్పు లేదు. కానీ అంతకుమించి వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని, అది ప్రేమేనని అంటున్నారు బాలీవుడ్ ఔత్సాహికరాయుళ్లు. మరి.. విద్యుత్, అదా మధ్యలో నిజంగా ప్రేమ చిగురించిందా? అనే విషయంలో స్పష్టత రావాలంటే మరికొంత సమయం వేచి ఉండక తప్పదు. -
కొత్త జాబ్!
ఇక్కడున్న ఫొటోలో తూకం వేయడానికి పచ్చి మిరపకాయలను తీసుకుంటూ పిచ్చి చూపులు చూస్తోన్న ఈ హీరోయిన్ను గుర్తుపట్టే ఉంటారు. ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గాయం చేసిన అదా శర్మనే ఇలా కూరగాయలు అమ్మే అమ్మాయిగా మారారు. ఏదైనా కొత్త సినిమాలో డీ–గ్లామరస్ రోల్ చేస్తున్నారా? అంటే ఇంకా లేదు. డైరెక్టర్స్‌కు నచ్చితే చేస్తారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆమెకు హాలీవుడ్ నుంచి చాన్స్ వచ్చిందట. అందుకే ఇలా లుక్ టెస్ట్ చేస్తున్నారని బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అదా రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే. దాదాపు పది సంవత్సరాల క్రితం వచ్చిన ‘1920’ హిందీ సినిమాతో సిల్వర్‌స్క్రీన్‌పైకి వచ్చారు అదా. ఆ తర్వాత సౌత్‌లో బిజీ హీరోయిన్గా మారిపోయారు. ప్రస్తుతం తమిళంలో ప్రభుదేవా హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్లో కమాండో సిరీస్ థర్డ్ పార్ట్‌లో అదా హీరోయిన్గా సెలక్ట్ అయ్యారని బాలీవుడ్ టాక్. మరి..ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓకే అయితే ఆమె కెరీర్ మరో స్టెప్ పైకి వెళ్తుంది. ఈ తరం ఫేమస్ స్టార్స్‌లో ఇప్పటివరకు ఐశ్వర్యారాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్, రీసెంట్గా రాధికా ఆప్టే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాలీవుడ్లో నటించారు. మరి.. అదా కూడా వెళ్తారా? అనేది తెలియాలంటే కాస్త టైమ్ పడుతుంది. -
తుది దశలో చార్లీచాప్లిన్–2
తమిళసినిమా: ఇంతకుముందు ప్రభు, ప్రభుదేవా కలిసి నటించిన పూర్తి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టెయినర్ చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో తాజాగా ఆ చిత్ర దర్శకుడు శక్తి చిదంబరంనే దానికి సీక్వెల్‌గా చార్లీచాప్లిన్–2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్వకత్వంలో పార్టీ అనే కలర్‌ఫుల్ చిత్రాన్ని నిర్మిస్తున్న అమ్మా క్రియేషన్స్ శివనే ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోనూ ప్రభుదేవా, ప్రభు కలిసి నటిస్తుండడం విశేషం. ఇక హీరోయిన్లుగా గ్లామర్ డాల్స్ నిక్కీగల్రాణి, బాలీవుడ్ భామ ఆదాశర్మ నటిస్తున్నారు. ఆదాశర్మకు ఇదే తోలి తమిళ చిత్రం అవుతుంది. ఇతర ముఖ్య పాత్రల్లో రవిమరియ, సెంథిల్, ఆకాశ్, వివేక్ ప్రసన్న,శామ్స్, శాంత, కావ్య, మగధీర చిత్ర ఫేమ్ దేవ్‌సింగ్, ముంబై విలన్ సమీర్ కోచ్, కోవమల్శర్మ, అమీత్, నట్పుకాగ వైభన్ నటిస్తున్నారు. అమ్రేశ్ సంగీతాన్ని, సౌందర్‌రాజన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీనికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను అందిస్తున్న శక్తిచిదంబరం చిత్ర వివరాలను తెలుపుతూ చార్లీచాప్లిన్–2 పూర్తిగా కమర్శియల్ కామెడీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం తుది ఘట్ట చిత్రీకరణ జరుపుకుంటోందదని తెలిపారు. -
రారండోయ్ వేడుక చేద్దాం
పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. శుభలేఖలు పంచారు. తిరుపతిలో పెళ్లి మండపం బుక్ చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లికూతురి కుటుంబాలు రారండోయ్ వేడుక చేద్దాం అని తిరుపతికి బయల్దేరాయి. అలకలు, బుజ్జగింపులు, సరదాలతో పెళ్లిసందడి మొదలైంది. అంతలో సడన్‌గా ఓ ట్విస్ట్. అంతే పెళ్లాగిపోయే పరిస్థితులు వచ్చాయట. ఆ ట్విస్ట్ ఏంటి? అసలు పెళ్లి జరిగిందా? అన్న ప్రశ్నలకు ఆన్సర్ కావాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శకులు శక్తీ చిదంబరం. ప్రభుదేవా, నిక్కీ గల్రానీ, అదా శర్మ ముఖ్యపాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. 15ఏళ్ల క్రితం చిదంబరం డైరెక్ట్ చేసిన ‘చార్లీ చాప్లీన్’ కు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారన్నది కోలీవుడ్ సమాచారమ్. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ‘‘చార్లీ చాప్లీన్ 2’ సినిమాలో ప్రభుదేవాతో డ్యాన్స్ చేస్తున్నాను. ఆయన ఎక్స్ప్రెషన్స్ సూపర్. ఇక్కడ మరికొన్ని సాంగ్స్‌ను షూట్ చేసిన తర్వాత చెన్నైలో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నాం’’అని పేర్కొన్నారు అదా శర్మ. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
భాగ్యనగరం చాట్ భలే..
నాకు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలంటే ఇంకా మరీనూ. అందులోనూ హైదరాబాద్‌లో షూటింగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఇక్కడి థియేటర్స్‌లో సినిమాలు చూడటం అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఇన్ని ఇష్టాలతో పాటు మరొకటి.. ఇక్కడ దొరికే చాట్. మామూలుగా చాట్ అంటే.. ముంబైలోనే ఫేమస్. నేను అక్కడికి వెళ్లినప్పుడల్లా ఓ పట్టు పడతా. ఓసారి హైదరాబాదీ చాట్ టేస్ట్ చేశా. నాకైతే ముంబైలో దొరికే చాట్కన్నా భాగ్యనగరంలో దొరికే చాట్ భలేగా ఉందనిపించింది. ఇక, ఇక్కడివాళ్ల గురించి చెప్పాలి. వాళ్ల ప్రవర్తన చాలా స్వీట్‌గా ఉంటుంది. నాకిక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లతో కలిసి చాట్ తినడం, సినిమాలు చూడటం లాంటివి ఎప్పుడూ మిస్ కాను. ఓవరాల్‌గా చెప్పాలంటే హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అయిపోయింది. - ఆదాశర్మ, సినీనటి