భాగ్యనగరం చాట్ భలే..
నాకు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలంటే ఇంకా మరీనూ. అందులోనూ హైదరాబాద్‌లో షూటింగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఇక్కడి థియేటర్స్‌లో సినిమాలు చూడటం అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఇన్ని ఇష్టాలతో పాటు మరొకటి.. ఇక్కడ దొరికే చాట్. మామూలుగా చాట్ అంటే.. ముంబైలోనే ఫేమస్. నేను అక్కడికి వెళ్లినప్పుడల్లా ఓ పట్టు పడతా. ఓసారి హైదరాబాదీ చాట్ టేస్ట్ చేశా. నాకైతే ముంబైలో దొరికే చాట్‌కన్నా భాగ్యనగరంలో దొరికే చాట్ భలేగా ఉందనిపించింది.
ఇక, ఇక్కడివాళ్ల గురించి చెప్పాలి. వాళ్ల ప్రవర్తన చాలా స్వీట్‌గా ఉంటుంది. నాకిక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లతో కలిసి చాట్ తినడం, సినిమాలు చూడటం లాంటివి ఎప్పుడూ మిస్ కాను. ఓవరాల్‌గా చెప్పాలంటే హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అయిపోయింది. - ఆదాశర్మ, సినీనటి