అదా శర్మ
ఇక్కడున్న ఫొటోలో తూకం వేయడానికి పచ్చి మిరపకాయలను తీసుకుంటూ పిచ్చి చూపులు చూస్తోన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టే ఉంటారు. ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గాయం చేసిన అదా శర్మనే ఇలా కూరగాయలు అమ్మే అమ్మాయిగా మారారు. ఏదైనా కొత్త సినిమాలో డీ–గ్లామరస్ రోల్ చేస్తున్నారా? అంటే ఇంకా లేదు. డైరెక్టర్స్‌కు నచ్చితే చేస్తారు. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఆమెకు హాలీవుడ్ నుంచి చాన్స్ వచ్చిందట. అందుకే ఇలా లుక్ టెస్ట్ చేస్తున్నారని బాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అదా రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే.
దాదాపు పది సంవత్సరాల క్రితం వచ్చిన ‘1920’ హిందీ సినిమాతో సిల్వర్‌స్క్రీన్‌పైకి వచ్చారు అదా. ఆ తర్వాత సౌత్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయారు. ప్రస్తుతం తమిళంలో ప్రభుదేవా హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో కమాండో సిరీస్ థర్డ్ పార్ట్‌లో అదా హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యారని బాలీవుడ్ టాక్. మరి..ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓకే అయితే ఆమె కెరీర్ మరో స్టెప్ పైకి వెళ్తుంది. ఈ తరం ఫేమస్ స్టార్స్‌లో ఇప్పటివరకు ఐశ్వర్యారాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్, రీసెంట్‌గా రాధికా ఆప్టే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాలీవుడ్‌లో నటించారు. మరి.. అదా కూడా వెళ్తారా? అనేది తెలియాలంటే కాస్త టైమ్ పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment