vidhyuth Jamwal
-
నా సినిమాల్లో దేశభక్తి అలా కుదురుతోంది!
‘‘ఇండియన్ ఇంటెలిజెన్సీ బ్యూరో ప్రతినిధులు పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఓ స్పై ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ మిషన్ సక్సెస్ఫుల్ కావడం వల్ల వేలాదిమంది భారతీయుల ప్రాణాలు రక్షించబడ్డాయి. ఈ మిషన్ తాలూకు విషయాలను తెలుసుకోవాలంటే ‘ఐబీ 71’ సినిమా చూడాలి. ఓ చారిత్రాత్మక ఘటనతో తీసిన ఈ చిత్రంలో దేశభక్తి తాలూకు మూమెంట్ప్ ఉంటాయి’’ అన్నారు దర్శకుడు సంకల్ప్‌రెడ్డి. విద్యుత్ జమాల్ హీరోగా నటించి, నిర్మించిన హిందీ థ్రిల్లర్ ‘ఐబీ 71’. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సంకల్ప్మాట్లాడుతూ– ‘‘ఘాజీ’ ఇన్సిడెంట్‌కు ముందు కశ్మీర్లో జరిగిన ఓ ఘటన ఆధారంగా తీసిన చిత్రమే ‘ఐబీ 71’. ‘ఘాజీ’, ‘రాజీ’, ఇప్పుడు ఈ ‘ఐబీ 71’.. ఇవన్నీ ఇండియా–పాకిస్తాన్ (1971) యుద్ధానికి ముందు జరిగిన ఘటనల నేపథ్యంలో వచ్చిన సినిమాలు. ఈ ఘటల తాలుకూ విషయాలు అప్పట్లో న్యూస్‌పేపర్స్‌లో ప్రచురితమయ్యాయి. ఆ సమాచారం ఆధారంగా, కొత్తమంది వ్యక్తుల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. ‘ఘాజీ’, ‘అంతరిక్షం’, ఇప్పుడు ‘ఐబీ 71’ కథల్లో భాగంగానే దేశభక్తి అంశం మిళితమై ఉంది. అంతేకానీ ప్రత్యేకంగా దేశభక్తి నేపథ్యాల్లో చేయాలని నేనీ సినిమాలు చేయలేదు. అలా కుదురుతోంది.. అంతే. బహుశా అంతర్లీనంగా నాలో ఉన్న దేశభక్తి ఓ కారణమేమో! హిందీలో నాకు ‘ఐబీ 71’ తొలి సినిమా. తెలుగులో నా తొలి సినిమా ‘ఘాజీ’ అండర్‌వాటర్ బ్యాక్‌డ్రాప్, రెండో సినిమా ‘అంతరిక్షం’ స్పేస్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయి. ‘ఐబీ 71’ బ్యాక్‌డ్రాప్ ఆకాశం. అలాగే భూమి, నిప్పుల బ్యాక్‌డ్రాప్‌లో కూడా సినిమాలు చేయాలని ఉంది’’ అని అన్నారు. -
సీక్రెట్ మిషన్
తెలుగులో ‘ఘాజీ’, ‘అంతరిక్షం 9000కేఎమ్‌పీహెచ్’ వంటి చిత్రాలను తీసిన సంకల్ప్ రెడ్డి హిందీలో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఐబీ 71’. విద్యుత్ జమాల్ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ ఓ లీడ్ రోల్ చేశారు. స్పైజానర్లో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, చిత్రాన్ని మే 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘1971లో ఇండియా–పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ వార్‌లో భారతదేశం గెలవడానికి దేశ ఇంటెలిజెన్స్ బ్యూరో చేసిన ఓ సీక్రెట్ మిషన్ ఏ విధంగా దోహదపడింది? అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం’’ అని యూనిట్ పేర్కొంది. -
విద్యుత్ జమాల్.. కలరిపయట్టు
‘కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’ అని ‘దూకుడు’ సినిమాలో మహేశ్‌బాబు అంటారు. బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్ కూడా ఇలాంటి మాటే అంటున్నారు. ‘మెదడు గుడ్డిది అయితే కళ్లు ఉన్నా ఉపయోగం లేదు’ అంటున్నారు ఆయన. వీలున్నప్పుడల్లా తన సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్‌ను ప్రదర్శిస్తూ ఉంటారాయన. అలానే తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మార్షల్ ఆర్ట్స్, ఫిట్నెస్ విషయాలనే ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. తాజాగా ప్రాచీన యుద్ధ విద్య కలరిపయట్టులో శిక్షణ తీసుకుంటున్న ఓ వీడియోను పంచుకున్నారు. కళ్లకు మైనం వేసుకొని దాని మీద ఓ బట్టతో కళ్లు కట్టేసుకున్నారు. కత్తి తీసుకుని పండ్లను నేర్పుగా కట్ చేయడం ఆ వీడియోలో కనబడుతుంది. ‘‘ఈ ఆర్ట్ వల్ల మన ఫోకస్ మొత్తం ఒక పని మీద పెట్టడం అలవర్చుకోవచ్చు. చాలా ఏళ్లుగా ఈ విద్యను నేర్చుకోవాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది’’ అన్నారు విద్యుత్ జమాల్. -
హిందీకి..
‘ఘాజీ, అంతరిక్షం’ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను, ప్రత్యేకతను చాటుకున్నారు యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. తన మూడో సినిమాను బాలీవుడ్లో చేయడానికి సంప్రదింపులు చేస్తున్నారు. ఆల్రెడీ ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా సిద్ధం చేస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ సినిమా కూడా కమిట్ అయినట్లు సమాచారం. విద్యుత్ జమాల్ హీరోగా ఓ సినిమా తీయడానికి కథ సిద్ధం చేయమని విద్యుత్ తండ్రి సంకల్ప్‌ని కోరారట. ఆ కథను కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారట సంకల్ప్. ఈ రెండు ప్రాజెక్ట్స్‌లో ఏది ముందు సెట్స్ మీదకు వెళ్తుందో వేచి చూడాలి. -
సత్తా చూపిస్తా
కెరీర్లో ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేశారు హీరోయిన్ అదా శర్మ. తాజాగా ‘కమాండో 3’ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారామె. దాని గురించి అదా మాట్లాడుతూ– ‘‘కమాండో 3’లో పోలీసాఫీసర్ భావనా రెడ్డి పాత్రలో నటించాను. నా పాత్రలో యాక్షన్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల కోసం ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. కేరళలో కళరియపట్టు, తమిళనాడులో సిలంబం వంటి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యత సంపాదించాను. నాన్చాక్ కూడా సాధన చేశా. నా కో–స్టార్ విద్యుత్ జమాల్ ఈ విషయంలో నాకు కొంతమేర సహాయం చేశారు. కానీ, నా శిక్షణ మొత్తాన్ని మా అమ్మగారు దగ్గరుండి చూసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌తో భావన సత్తా ఏంటో వెండితెరపై చూపిస్తా’’ అని పేర్కొన్నారు. విద్యుత్ జమాల్, అదా శర్మ జంటగా నటించిన ‘కమాండో 3’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. -
ప్రేమలో పడ్డారా?
‘కమాండో 3’ సినిమా సెట్లో డాక్టర్ అవతారం ఎత్తారు హీరో విద్యుత్ జమాల్. అదేంటీ... కమాండో సిరీస్‌లో యాక్షన్ హీరోగా చేస్తున్న జమాల్ సడన్‌గా డాక్టర్ పాత్ర చేయడం ఏంటీ? అని కన్ఫ్యూజ్ కావొద్దు. ఆయన డాక్టర్‌గా మారింది ‘హార్ట్ ఎటాక్’ మూవీ హీరోయిన్ అదా శర్మ కోసం. ఇటీవల ‘కమాండో 3’ సినిమా సెట్లో అదా శర్మ గాయపడ్డ విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు షూటింగ్లో పాల్గొంటున్నారనుకోండి. కానీ ఆమెకు గాయం అయితే తనకు గాయం అయినట్లుగా విద్యుత్ విలవిలలాడిపోయారట. ఓ డాక్టర్లా జాగ్రత్తలు చెప్పారట. అంతేనా? సెట్లో కెమెరా కోసమే కాదు.. కెమెరా వెనక కూడా చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారని బాలీవుడ్ టాక్. కో–స్టార్స్ అంటే ఆ మాత్రం క్లోజ్‌నెస్ ఉండటంలో తప్పు లేదు. కానీ అంతకుమించి వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని, అది ప్రేమేనని అంటున్నారు బాలీవుడ్ ఔత్సాహికరాయుళ్లు. మరి.. విద్యుత్, అదా మధ్యలో నిజంగా ప్రేమ చిగురించిందా? అనే విషయంలో స్పష్టత రావాలంటే మరికొంత సమయం వేచి ఉండక తప్పదు. -
అది నా అదృష్టం
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రుతీహాసన్. తండ్రి కమల్‌హాసన్‌కు తగ్గ తనయగా మార్కులు కొట్టేస్తూనే, సొంత అభిమానులను సంపాదించుకున్నారామె. కథానాయికగా డిఫరెంట్ క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ ముందుకు వెళుతోన్న శ్రుతిలో మ్యూజిక్ కంపోజింగ్ టాలెంట్ కూడా ఉందని ప్రత్యేకించి చెప్పకర్లేదు. యాక్టింగ్, మ్యూజిక్వైజ్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అన్న ప్రశ్నను శ్రుతీ ముందు ఉంచితే– ‘‘మా నాన్నగారు నటించి, దర్శకత్వం వహించిన ‘హే రామ్’లో నేను ఓ గెస్ట్ రోల్ చేశాను. అయితే నటిగా అది నాకు మొదటి సినిమా అని నేను అనుకోవడంలేదు. కానీ ఆ సినిమాతో కెమెరా ముందుకు వచ్చినందుకు ఫుల్ హ్యాపీ. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం బాలీవుడ్లో ‘లక్’ మూవీ చేశాను. యాక్టర్‌గా నా తొలి మూవీ అదే. సినిమా ప్రపంచాన్ని నా కళ్లు అర్థం చేసుకుంది అప్పుడే. అందుకే ‘లక్’ని నా మొదటి సినిమాలా భావిస్తున్నాను. యాక్టర్‌గా నా జర్నీ బాగుంది. ఇక మ్యూజిక్ కంపోజింగ్ అనేది నా న్యాచురల్ ఎక్స్టెన్షన్. సాధారణంగా చాలామందిలో యాక్టింగ్ లేదా మ్యూజిక్ ఏదో ఒక టాలెంట్ మాత్రమే ఉంటుంది. కానీ ఆ రెండింటినీ నేను చేయగలుగుతుండటం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నారామె. ప్రస్తుతం మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ హిందీ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో హీరో విద్యుత్ జమాల్. -
ఫస్ట్ డే ఫన్నీ డే
విద్యుత్ జమాల్, శ్రుతీహాసన్ జంటగా నటించిన తొలి చిత్రం ‘యారా’. ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాలో జోడీగా నటించేందుకు రెడీ అయ్యారు వీరిద్దరూ. అదెలా అంటే? అలా కుదిరేసిందంతే. జమాల్, శ్రుతి జంటగా తిగ్మాంషు దులియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యారా’ ఇంకా విడుదల కాలేదు. కానీ, మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో విద్యుత్ జమాల్, శ్రుతీహాసన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం స్టార్ట్ అయ్యింది. ‘‘నా కెరీర్లో మరో సినిమా జర్నీ స్టార్ట్ అయింది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. జమాల్‌తో మళ్లీ కలిసి నటించబోతున్నాను. ఫస్ట్ డే ఫన్నీడే’’ అని పేర్కొన్నారు శ్రుతి. గతేడాది ఆమె నటించిన ‘బెహన్ హోగి తేరి’ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఈ సంగతి అలా ఉంచితే.. ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత తెలుగులో మరో చిత్రం ఒప్పుకోలేదు శ్రుతీహాసన్. -
ఊ కొట్టారా? ఊహూ అన్నారా?
ఆల్మోస్ట్ తొమిదేళ్ల క్రితం ‘లక్’ సినిమాతో బీటౌన్‌లో కథానాయికగా అడుగుపెట్టారు శ్రుతీహాసన్. ఆ తర్వాత అరడజనుకు పైగా హిందీ సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్గా బాలీవుడ్లో పేరు తెచ్చుకోలేకపోయారు. కానీ ఆ ప్రయత్నం మాత్రం ఆపలేదు. అందులో భాగంగానే బాలీవుడ్లో ఆమె మరో ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపారని టాక్. యాక్షన్ స్టార్ విద్యుత్ జమాల్ హీరోగా మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతీహాసన్‌ను సంప్రదించారట చిత్రబృందం. స్క్రిప్ట్ విని ఎగై్జట్ అయ్యారట శ్రుతి. ఇక అధికారికంగా ఎనౌన్స్మెంట్ రావడమే ఆలస్యం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే... ఆల్రెడీ ‘యారా’ అనే చిత్రంలో విద్యుత్ జమాల్, శ్రుతీహాసన్ జంటగా నటించారు. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా విడుదలలో జాప్యం జరుగుతోంది. ఈ సినిమా రషెస్ చూసి విద్యుత్‌తో శ్రుతీ కెమిస్ట్రీ బాగుందని టీమ్ మెంబర్స్ కూడా భావించారని బీటౌన్ టాక్.ఒకవేళ ఈ సినిమాకు ఓకే చెబితే ఫారిన్ రిటర్న్ అమ్మాయి పాత్రలో నటించనున్నారట శ్రుతి. మరి.. ప్రచారంలో ఉన్నట్లు శ్రుతి ఈ ప్రాజెక్ట్‌కి ఊ కొట్టారా? ఊహూ అన్నారా? అనేది తెలియాలంటే వెయిట్ అండ్ సీ. బాలీవుడ్లో శ్రుతీ నటించిన చివరి చిత్రం ‘బెహన్ హోగి తేరి’. ఈ చిత్రం గతేడాది రిలీజైన సంగతి తెలిసిందే. ఆ మాటకొస్తే.. తెలుగులో ‘కాటమరాయుడు’ తర్వాత మరో సినిమా ఒప్పుకోలేదు. ఈ సినిమా విడుదలై ఏడాది అవుతోంది. ఈ 12 నెలల్లో శ్రుతి తమిళ చిత్రాలకు కూడా ‘ఊ’ కొట్టలేదు. మంచి కథ, పాత్ర అయితేనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారట. లేకపోతే ‘ఊహూ’ అన్నదే ఈ బ్యూటీ సమాధానం అని పరిశీలకులు అంటున్నారు. -
స్టార్ హీరోయిన్ సినిమా ఆగిపోయింది..!
సౌత్ లో మంచి ఫాంలో ఉన్నా... బాలీవుడ్ లో సత్తా చాటేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది స్టార్ వారసురాలు శృతిహాసన్. కాటమరాయుడు సినిమాలో తన లుక్స్ పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ భామ తరువాత సౌత్ సినిమాలేవి అంగీకరించలేదు. చేతిలో ఉన్న సంఘమిత్ర నుంచి కూడా తప్పుకొని పూర్తిగా బాలీవుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. అయితే ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన బెహన్ హోగీ తేరి సినిమాతో మరోసారి ఫెయిల్ అయిన శృతికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. శృతి హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'యారా' ఆగిపోయింది. విధ్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్న ఈసినిమా చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ చిత్ర నిర్మాణం కొనసాగించలేమని భావించిన యూనిట్, నిర్మాణం ఆపేస్తున్నామని తెలిపారు. తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శభాష్ నాయుడు సినిమా తప్ప మరే సినిమా కూడా శృతి హాసన్ చేతిలో లేదు. ఆ సినిమా కూడా ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. ప్రస్తుతం శృతి బాయ్ ఫ్రెండ్ తో విదేశాల్లో చక్కర్లు కొడుతుందన్న ప్రచారం జరుగుతోంది.