సీక్రెట్‌ మిషన్‌ | Vidyut Jammwal New Movie IB 71 Teaser Release | Sakshi
Sakshi News home page

సీక్రెట్‌ మిషన్‌

Published Mon, Apr 17 2023 4:27 AM | Last Updated on Mon, Apr 17 2023 4:27 AM

Vidyut Jammwal New Movie IB 71 Teaser Release - Sakshi

తెలుగులో ‘ఘాజీ’, ‘అంతరిక్షం 9000కేఎమ్‌పీహెచ్‌’ వంటి చిత్రాలను తీసిన సంకల్ప్‌ రెడ్డి హిందీలో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఐబీ 71’. విద్యుత్‌ జమాల్‌ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌ ఓ లీడ్‌ రోల్‌ చేశారు.

స్పైజానర్‌లో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, చిత్రాన్ని మే 12న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ‘‘1971లో ఇండియా–పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరిగింది. ఈ వార్‌లో భారతదేశం గెలవడానికి దేశ ఇంటెలిజెన్స్‌ బ్యూరో చేసిన ఓ సీక్రెట్‌ మిషన్‌ ఏ విధంగా దోహదపడింది? అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement