secret mission
-
102 టన్నుల బంగారం.. ఆర్బీఐ సీక్రెట్ ఆపరేషన్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీగా బంగారం నిల్వలు ఉన్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ భారీగా బంగారాన్ని దాచింది ఆర్బీఐ. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా 102 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వాల్ట్‌ల నుండి స్వదేశానికి తిరిగి తీసుకొచ్చింది.‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. లండన్‌లోని భూగర్భ వాల్ట్‌ల నుండి బంగారాన్ని భారత్‌కు తీసుకురావడం గత మే నెల తర్వాత ఇది రెండవసారి. ఆర్బీఐ మొత్తం 855 టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. ఇందులో దాదాపు 510.5 టన్నుల బంగారం దేశంలోనే ఉంది. 2022 నుండి దాదాపు 214 టన్నుల పసిడిని స్వదేశానికి తీసుకొచ్చింది ఆర్బీఐ.పెరుగుతున్న ప్రపంచ ఆందోళనలు ఆర్బీఐ, భారత ప్రభుత్వాన్ని కలవరపరిచాయి. దీంతో మన బంగారాన్ని స్వదేశానికి తెచ్చుకోవడం సురక్షితమని భావించిన అధికారులు ఈ తరలింపు చేపట్టారు. 1990లలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభం కారణంగా చేపట్టిన తరలింపు తర్వాత ఇదే మొదటి భారీ తరలింపు.ప్రత్యేక విమానం.. హై సెక్యూరిటీప్రత్యేక విమానం, అత్యంత భారీ భద్రతా ఏర్పాట్ల సహాయంతో ఆర్బీఐ, భారత ప్రభుత్వం సంయుక్తంగా బంగారం తరలింపు మిషన్‌ను అమలు చేశాయని వార్తా నివేదిక తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని తరలింపులు ఉండవచ్చని కూడా అధికారులు చెబుతున్నారు.భారత్ ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్లో 324 టన్నుల బంగారం కలిగి ఉంది. ఇందులో ఎక్కువ మొత్తం యూకేలోనే ఉంది. అందులోనూ 20 టన్నుల పసిడి డిపాజిట్ల రూపంలో అక్కడ ఉంచింది. కాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తన తొమ్మిది భూగర్భ వాల్ట్‌లలో వివిధ దేశాలకు చెందిన దాదాపు 400,000 బార్లు (సుమారు 5,350 టన్నులు) బంగారం ఉంది. -
సీక్రెట్ మిషన్
తెలుగులో ‘ఘాజీ’, ‘అంతరిక్షం 9000కేఎమ్‌పీహెచ్’ వంటి చిత్రాలను తీసిన సంకల్ప్ రెడ్డి హిందీలో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఐబీ 71’. విద్యుత్ జమాల్ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ ఓ లీడ్ రోల్ చేశారు. స్పైజానర్లో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, చిత్రాన్ని మే 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘1971లో ఇండియా–పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ వార్‌లో భారతదేశం గెలవడానికి దేశ ఇంటెలిజెన్స్ బ్యూరో చేసిన ఓ సీక్రెట్ మిషన్ ఏ విధంగా దోహదపడింది? అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం’’ అని యూనిట్ పేర్కొంది. -
పాక్‌లో దిలీప్ కుమార్ రహస్య పర్యటన!
భారతదేశంలో తన పర్యటన ముగియగానే పాక్ విదేశాంగ శాఖ మాజీమంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరీ ఒక్కసారిగా విషం చిమ్మారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ భారత ప్రభుత్వం కోసం రెండు సార్లు పాకిస్థాన్‌లో రహస్యంగా పర్యటించారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయంగా దిలీప్ కుమార్ భార్య సైరాబానుయే తనకు చెప్పారని అన్నారు. భారత ప్రభుత్వం ప్రత్యేకంగా సమకూర్చిన విమానంలో ఆయన ఇస్లామాబాద్‌కు వెళ్లారని చెప్పారు. బహుశా జియా ఉల్ హక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒకసారి దిలీప్ కుమార్ పాక్‌కు వచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మరోసారి ఈమధ్యనే వచ్చి వెళ్లారన్నారు. తాను మహాత్మాగాంధీ శిష్యులు కొందరిని మణిభవన్‌లో కలిశానని చెప్పారు. భారతదేశం నుంచి పాకిస్థాన్‌కు రావాల్సిన బకాయిల కోసం మహాత్మాగాంధీ నిరవధిక నిరాహార దీక్ష చేశారన్న విషయం పాకిస్థాన్‌లో కూడా చాలామందికి తెలియదని కసూరీ అన్నారు. తర్వాత జిన్నాహౌస్కు వెళ్లానని, కానీ అది చూడగానే తన హృదయం ద్రవించిపోయిందని చెప్పారు. దానికి ఏమాత్రం మరమ్మతులు చేయకుండా, అలాగే శిథిలావస్థలో వదిలేశారన్నారు. దాన్ని ముంబైలోని పాక్ కాన్సులేట్‌గా ఉపయోగించుకోవచ్చని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. జిన్నా భారతదేశంలో ఉన్న చివరిరోజు ముంబైలో దిలీప్‌కుమార్‌ను కలిశారని తెలిపారు.